YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా చేరికలు

పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా చేరికలు

పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా చేరికలు
 వైకాపాలో చేరిన మాజీ కార్పొరేటర్ భాను శ్రీ
నెల్లూరు ఫిబ్రవరి 13, (న్యూస్ పల్స్)
రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా ను బలోపేతం చేయడమే లక్ష్యంగా నూతన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. స్థానిక నెల్లూరు గ్రామీణ నియోజవర్గ కార్యాలయంలో నూతన  షేర్ఇట్ ల కార్యక్రమాన్ని ఘనంగా గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ కార్పొరేటర్ భానుశ్రీ ఆమె అనుచరగణంతో పార్టీలో చేరడం అభినందనీయమన్నారు. భాను శ్రీ పార్టీలో చేరేందుకు చొరవ చూపిన నాయకులకు అభినందనలు తెలియజేశారు. మాట్లాడుకుందాం రానున్న నగరపాలక, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా 100% విజయం సాధించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా పార్టీ లో నూతనంగా చేరిన మాజీ మేయర్ భానుశ్రీ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో నెల్లూరు నగరంలోని 54 డివిజన్లలో వైకాపా అభ్యర్థులుగా పోటీ చేయుటకు ప్రతిపాదించిన ప్రతి కార్పొరేట్లకు తన వంతు చేయూత అందిస్తామని భరోసా ఇచ్చారు. నెల్లూరు నగరాన్ని వైకాపాకు కంచుకోట గా తీర్చి దిద్దటం లో మన వంతు సహకరిస్తానని తెలిపారు. నమ్మకంతో కొరతతో పాటు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీ నిబంధనలకు లోబడి, పార్టీ లక్ష్యసాధనకు లక్ష్యసాధనకు ప్రతి ఒక్కరు ఐక్యతగా కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు అనిల్ కుమార్ యాదవ్ మరియు రాష్ట్ర ఇన్చార్జి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొనగా, నూతన గృహ కార్యక్రమానికి అధ్యక్షులుగా శాసనసభ్యులు ఫోటోలు శ్రీధర్ రెడ్డి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ విజయ్ కుమార్ రెడ్డి, విజయ డైరీ ఛైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, వైకాపా యువజన నాయకులు కుమార్ యాదవ్, నెల్లూరు గ్రామీణం కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, డివిజన్ ఇన్చార్జులు మేఘనాథ్ సింగ్, హజ్రత్ నాయుడు, మురళీ కృష్ణ యాదవ్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు సత్తార్, రాజరాజేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు తోట శోభారాణి తదితరులు పాల్గొన్నారు.

Related Posts