YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

 ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకే అవకాశాలు కన్నడ సంఘాలు రెండు రోజుల బంద్

 ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకే అవకాశాలు కన్నడ సంఘాలు రెండు రోజుల బంద్

 ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకే అవకాశాలు
     కన్నడ సంఘాలు రెండు రోజుల బంద్
బెంగళూరు ఫిబ్రవరి 13 
తమ రాష్ట్రంలో ప్రభుత్వ.. ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకే అవకాశాలు ఇవ్వాలని.. 75 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కన్నడ సంఘాలు రెండు రోజుల బంద్ పాటిస్తున్నాయి. డిజిటల్ యుగంలో ప్రపంచం కుగ్రామంలా మారిపోతున్న వేళ.. కొన్ని రాష్ట్రాల్లో రాజకీయాల కోసం స్థానికులకు పెద్దపీట వేయాలన్న నినాదాన్ని తెర మీదకు తెచ్చి రచ్చ చేయటం ఎక్కువైంది. స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలన్న నినాదాన్నే అమెరికాలో అమలు చేస్తే మన పరిస్థితి ఏమిటి? అయినా.. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలోనూ లోకల్.. నాన్ లోకల్ అన్న అనవసరమైన తేనెతుట్టెను కదిపించటం కంటే.. టాలెంట్ ఉంటే చాలు.. ఎవరైనా ఎక్కడైనా బతికేయొచ్చన్న భావనను పెంచాల్సి ఉంది. కానీ.. అందుకు భిన్నంగా రాజకీయ ప్రయోజనాల కోసం తెర మీదకు తెచ్చే లోకల్ ఫీలింగ్ తో అనవసరమైన రచ్చ షురూ అవుతుంది. తాజాగా కర్ణాటకలో అలాంటి పరిస్థితే నెలకొంది. కర్ణాటక రాష్ట్రంలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ఉండాలని.. 75 శాతం వారికే కేటాయించాలని కోరుతూ పలు కన్నడ సంఘాలు రెండు రోజుల బంద్ కు పిలుపు ఇవ్వటం.. అది కాస్తా తీవ్రంగా మారి.. హింస దిశగా అడుగులు వేయటం ఆందోళనకు కలిగిస్తోంది. మూడు దశాబ్దాల క్రితం ఒక కమిటి ఇచ్చిన నివేదికను యడ్డి సర్కారు అమలు చేయాలని కన్నడ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.తాజాగా చేస్తున్న బంద్ తో కర్ణాటకలో జనజీవనం స్తంభించింది. పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫరంగిపేట వద్ద ఏపీకి చెందిన బస్సులపై ఆందోళనకారులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఏపీ టూరిజం బస్సులు తిరుపతి నుంచి మంగళూరుకు వెళుతుండగా ఈ దాడి జరిగింది. అయితే.. ఈ ఘటనలో ఎవరూ గాయాలకు గురి కాలేదు.ఇక.. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో ప్రజా రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఓలా.. ఊబర్ లాంటి సర్వీసులు కూడా సరిగా నడటం వలేదు. దీంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురి అవుతున్నారు. ఈ బంద్ విషయంపై కాస్త ఆలస్యంగా స్పందించింది యడ్డి సర్కార్. ఆందోళన చేస్తున్న కన్నడ సంఘాలు చర్చలకు రావాలని ముఖ్యమంత్రి యడ్డి కోరారు. బంద్ పేరుతో ప్రజల్ని ఇబ్బందులు పెట్టొద్దన్న ఆయన.. ఆందోళనకారులు చర్చలకు రావాలన్నారు.

Related Posts