YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 సస్పెండ్ పై కేంద్ర ట్రై బ్యూనల్ ను ఆశ్రయించిన ఐపిఎస్ అధికారి 

 సస్పెండ్ పై కేంద్ర ట్రై బ్యూనల్ ను ఆశ్రయించిన ఐపిఎస్ అధికారి 

 సస్పెండ్ పై కేంద్ర ట్రై బ్యూనల్ ను ఆశ్రయించిన ఐపిఎస్ అధికారి 
విజయవాడ ఫిబ్రవరి 13
ఎన్నికలు పూర్తి అయిన తర్వాత నుంచి తనకు పోస్టింగ్ ఇవ్వకపోవడమే కాకుండా ఇపుడు తనను సస్పెండ్ చేయడం అన్యాయమని సీనియర్ ఐపిఎస్ అధికారి ఏ బి వెంకటేశ్వరరావు కేంద్ర ట్రై బ్యూనల్ ను ఆశ్రయించారు. రాజకీయ వత్తిడి తోనే తనను సస్పెండ్ చేశారని తన పిటిషన్ లో వెంకటేశ్వరరావు తెలిపారు. తన సస్పెన్షన్ చట్టవిరుద్ధం కాబట్టి సస్పెన్షన్ ఎత్తివేత కు ఆదేశాలు జారీ చేయాలని వేంకటేశ్వర రావు విజ్ఞప్తి చేశారు.నిరాధార ఆరోపణలు తో తనను సస్పెండ్ చేశారని ఏ బి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. గత ఏడాది మే 31 నుండి తనకు జీతం పోస్టింగ్ కూడా ఇవ్వలేదని పిటిషన్ లో ఆయన తెలిపారు. తన సస్పెన్షన్ చట్టవిరుద్ధం అని ఆయన అన్నారు. పిటిషన్ ను కేంద్ర ట్రిబ్యునల్ విచారణకు స్వీకరించింది.

Related Posts