ఉక్కు వ్యవహారలపై సీబీఐ విచారణ జరపాలి
విశాఖపట్నం ఫిబ్రవరి 13,
విశాఖ ఉక్కుపరిశ్రమలో జరుగుతున్ను అవినీతిప్తె సమగ్ర విచారరణ జరపాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేసారు. స్టీల్ ప్లాంట్ టి అండ్ డీసి వద్దదర్నా నిర్వహించారు. కాంట్రాక్టు కార్మికుల నియామకాలలో భారీగా అవినీతి జరిగిందన్నారు. అధికారులు, కొంతమంది యూనియన్ నాయకులు కూడా వున్నారని అందువలన సమగ్ర దర్యాప్తు చేసి అవినీతి తిమింగిలాలను పట్టుకోవాలని డిమాండ్ చేసారు. ఇటీవల ఒక ఉద్యోగి కాంట్రాక్ట్ ఉద్యోగాల అవకతవకల్లో సిబిఐ కి పట్టుబడడం సంచలనం రేపింది. అదేవిదంగా నాయకుల ముసుగులో చాలామంది వున్నారన్నారు...తక్షణ స్టీల్ ప్లాంట్ ను అవినీతిరహితంగా చెయ్యాలంటే దర్యాప్తు చేసి ప్రక్షాళన చెయ్యాలని కోరారు.