YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

 నేతల్లో పరివర్తన

 నేతల్లో పరివర్తన

 నేతల్లో పరివర్తన

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చాలా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో హనుమాన్ భక్తుడిగా అరవింద్ కేజ్రీవాల్ బహిరంగంగానే ప్రజల ముందుకు వచ్చారు. ఢిల్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన నేపథ్యంలో కేజ్రీవాల్ చేసిన ప్రసంగంలో ఢిల్లీని ఆశీర్వదించిన హనుమాన్‌కి ధన్యవాదాలు తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పు భారత రాజకీయాల్లో కొత్త ఉషోదయాన్ని తీసుకువచ్చిందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ ఫలితాలు తెచ్చిన నవ్యత్వం ఏదంటే కామ్ కా రాజనీతి అంటే పని చేసే రాజకీయాలు. ప్రభుత్వాలు చేపట్టే.. పాఠశాలలు, ఆసుపత్రులు, ఆరోగ్య సంరక్షణ, విద్యుత్తు వంటి అభివృద్ధి పనుల ప్రాతిపదికన ప్రజలు ఓటు వేస్తారని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ప్రత్యేకించి రాజకీయ వాతావరణం భయంకరమైన అవ్యవస్థ యొక్క రణగొణ ధ్వనుల విషపూరితమైపోయిన నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రసంగం నవ్యత్వంతో కూడుకుని ఉంది. కానీ అభివృద్ధి మాత్రమే అరవింద్ కేజ్రీవాల్‌కి ఇంతటి ఘనవిజయాన్ని సాధించి పెట్టలేదన్నది వాస్తవం.తనదైన జాతీయవాద బ్రాండుతో కరడు గట్టిన హిందూత్వ రాజకీయాలను మిళితం చేసి బీజేపీ ప్రజలను విభజించే రాజకీయాలను పరాకాష్టకు తీసుకుపోగా కేజ్రీవాల్ హనుమాన్ భక్తుడిగా తననుతాను కొత్తగా మార్చుకున్నారు. ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన తర్వాత, తన మతపరమైన అస్తిత్వాన్ని కూడా తన ప్రసంగంలో కేజ్రీవాల్ స్పర్శించారు. హనుమాన్ దినం. దేవుడు ఢిల్లీని ఆశీర్వదించారు. ఈ విజయానికి ఆ దేవుడికే నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు కేజ్రీవాల్. రాజకీయ నాయకులు ఏమాత్రం భయం, సంకోచాలు లేకుండా హిందూ మత చిహ్నాలను, గుర్తులను ధరించే సంస్కృతిని పెంపొందించడమే ఆరెస్సెస్ లక్ష్యం. ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి సురేష్ భయ్యా జోషి దీన్నే తాజాగా మరింత గట్టిగా నొక్కి చెప్పారు. ఆయన ప్రకారం హిందూ మతం అంటే భారతీయ జనతాపార్టీ అని కాదు. బీజేపీని వ్యతిరేకించడం అంటే  హిందువులను వ్యతిరేకించడం అని అర్థం కాదన్నారు. రాజకీయ పోరాటం కొనసాగాలని కానీ దాన్ని హిందువులతో ముడిపెట్టవద్దని భయ్యాజీ స్పష్టం చేశారు. అందుకే లోక్ సభ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ కైలాస్ మానసరోవర్ సందర్శనకు వెళ్లారు. పైగా తాను శివభక్తుడిననీ చెప్పుకుంటూ ఒక ఆలయం తర్వాత మరో ఆలయాన్ని సందర్శిస్తూ వెళ్లారు. అప్పుడే ఆరెస్సెస్ తన లక్ష్యానికి ఘనవిజయం దక్కనుందని పసిగట్టింది. బీహార్, పశ్చిమబెంగాల్ రాష్టాలలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీయేతర నేతలైన అరవింద్ కేజ్రీవాల్, మమతా బేనర్జీ వంటి వారు పుట్టుకొస్తే ఆశ్చర్యపోవలసింది ఏదీ లేదు లాలూ యాదవ్ ఆర్జేడీ వంటి వారు ఈకోవలో ముందుండి తాము శివ, కృష్ణ భక్తులమని చెప్పుకొంటున్నారు. బీజేపీయేతర రాజకీయ పార్టీలలో వాటి నాయకులలో వస్తున్న ఈ కొత్త పరివర్తన ఆరెస్సెస్‍‌కి మహదానందం కలిగిస్తోంది

Related Posts