YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మండలి ఛైర్మన్ కు షాక్

మండలి ఛైర్మన్ కు షాక్

మండలి ఛైర్మన్ కు షాక్
విజయవాడ, ఫిబ్రవరి 13
పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లుల వ్యవహారం రోజురోజుకు కాకరేపుతోంది. సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు కుదరదంటూ మండలి కార్యదర్శి తిప్పి పంపటంపై శాసనమండలి చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వెంటనే సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు చేసి తనకు నివేదించాలని మండలి కార్యదర్శికి చైర్మన్‌ షరీఫ్‌ ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.ఇంకా జాప్యం చేస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని మండలి కార్యదర్శిని షరీఫ్ ఘాటుగా హెచ్చరించినట్లు తెలుస్తోంది. రెండు బిల్లులకు సంబంధించి మండలి చైర్మన్‌ ఇప్పటికే సెలెక్ట్‌ కమిటీ సభ్యులను నియమించిన విషయం తెలిసిందే. అయితే సెలెక్ట్ కమిటీ ఏర్పాటు నిబంధనలకు విరుద్ధమని మండలిలో వైసీపీ పక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు.నిబంధనల ప్రకారం పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లులు పాసై పోయాయని బిల్లులు ఇప్పటికే పాసైపోయాయని మంత్రి సుభాష్ చంద్రబోస్ వెల్లడించారు. అలాగే సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు సంబంధించిన దస్త్రాన్ని మండలి కార్యదర్శి వెనక్కు పంపారు. దీంతో శాసనమండలి కార్యదర్శి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, ఇది సభా ధిక్కారమేనని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Related Posts