YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రెండో రాజధాని అవకాశం లేదు

రెండో రాజధాని అవకాశం లేదు

రెండో రాజధాని అవకాశం లేదు
హైద్రాబాద్, ఫిబ్రవరి 13
దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్‌ను చేసే అవకాశం ఉంది చాలా ఏళ్లుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. టైమ్స్ నౌ సమ్మిట్‌లో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌కు అనురాగ్ అనే వ్యక్తి ఇదే ప్రశ్నను సంధించారు. దీనికి కేటీఆర్ బదులిస్తూ.. దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్‌ను చేయడానికి భాగ్యనగర ప్రజలు అంగీకరించరన్నారు. ఈ ప్రతిపాదనకు కేజ్రీవాల్ కూడా అంగీకరిస్తారని తాను అనుకోవడం లేదన్నారు. తనకు కూడా ఈ ప్రతిపాదన పట్ల అనుమానాలు ఉన్నాయన్నారు. ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూస్తోందన్న కేటీఆర్.. గత ఐదేళ్లలో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. పలు సర్వేల్లో ఉత్తమ నివాస యోగ్యమైన నగరంగా భాగ్యనగరం అవార్డులు అందుకుందన్నారు.కేంద్రం నుంచి మాటసాయం కాదు, ఆర్థిక తోడ్పాటు కోరుకుంటున్నామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ కేంద్రానికి సూచించిందన్నారు. కానీ కేంద్రం నుంచి మాకు రూపాయి కూడా అందలేదన్నారు. సమాఖ్య వ్యవస్థ, టీమిండియా అనేవి మాటలకే పరిమితం అవుతున్నాయన్నారు.

Related Posts