YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చుట్టూ నీళ్లు.,.. అయినా మంచి నీటికి కన్నీళ్లే

చుట్టూ నీళ్లు.,.. అయినా మంచి నీటికి కన్నీళ్లే

చుట్టూ నీళ్లు.,.. అయినా మంచి నీటికి కన్నీళ్లే
కర్నూలు, ఫిబ్రవరి 14, 
కర్నూలు జిల్లా చూట్టు నీటి వనరులున్నాయి. తుంగభద్ర, వేదవతి, కృష్ణా, కుందూ, హంద్రీ లాంటి నదుల్లో నీటి లభ్యత ఉంది. ఈ నీటిని సరఫరా చేసేందుకు నిధులు కేటాయిస్తున్నారు. ఆ నిధులు సక్రమంగా ప్రణాళికా బద్ధంగా ఖర్చు చేయడంలో లోపం ఉంది. దీంతో ఏటా పల్లెలో తాగునీటి సమస్య తాండవ మాడుతోంది. సి.బెళగల్‌ మండలం గుండ్రేవుల, కొండాపురం గ్రామాలు తుంగభద్ర నదీ తీరానే ఉన్నాయి. యేటా ఈ నది నుంచి 100 టిఎంసిల దాకా నీరు ప్రవహిస్తోంది. నీటి లభ్యత ఉన్నప్పుడు తాగునీటి అవసరాల కోసం నిల్వ చేసుకునేలా సమ్మర్‌ స్టోరేజి ట్యాంకు లేవు. దీంతో గుండ్రేవల గ్రామానికి చెందిన ప్రజలు ప్రస్తుతం వినియోగానికి చేతి పంపునీళ్లు, తాగేందుకు మినరల్‌ వాటర్‌ను కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంచినీటి పథకానికి తుంగభద్రలో నీళ్లు అందడం లేదు. దీంతో ఈ రెండు గ్రామాల్లో నీటి సమస్య జఠిలంగా మారింది. ఏళ్ల తరబడి ఆస్పరి మండలంలో జోహరాపురం, బిల్లేకల్లు గ్రామంలో నీటి సమస్యతో ప్రజలు సతమతమ వుతున్నారు. ఆ గ్రామాలకు సంబంధించిన సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోకపోవడం నిర్లక్ష్యాన్నే గుర్తు చేస్తోంది. జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం దాదాపు రూ.232 కోట్లను కేటాయించింది. ఇంతపెద్ద మొత్తంలో ప్రభుత్వం నిధులను కేటాయించినా ఇప్పటిదాకా అధికారులు ఖర్చు చేసింది. కేవలం రూ.66 కోట్లు మాత్రమే నిధులున్నా ఆర్‌డబ్ల్యూఎస్‌ఎస్‌ అధికారుల వద్ద పక్కా ప్రణాళికలు లేవు. దీంతో ప్రతి యేటా తాగునీటి సమస్య పూర్తి స్థాయిలో ఏర్పడుతోంది. జోహరాపురం సంబంధించి బాపురం స్కీం నుంచి నీటిని అందించే పథకం ఉన్నా ఆ పథకం సక్రమంగా పని చేయకపోవడంతో ఆ గ్రామంలోని వక్కరేనునీరు నిల్వలపై ఆధారపడుతున్న పరిస్థితి ఉంది. వక్కరేనులో నీళ్లు ఎండితే ప్రజలకు నీటి కష్టాలు మొదలవుతాయి. బిల్లేకల్లులోనూ ఇదే పరిస్థితి. గతేడాది బిల్లేకల్లు గ్రామ పరిసరాల్లో నీటి లభ్యత లేకపోవడంతో హంద్రీనది నుంచి పైపులైన్‌ వేసేందుకు జిల్లా అధికారులు పూనుకున్న అది కార్యరూపం దాల్చలేదు. దీంతో ఇప్పటికే ఆ గ్రామంలో ప్రజలు తాగునీటికి కటకటలాడుతున్న పరిస్థితి ఉంది. వేసవికి ముందే ఇంతటి తీవ్ర నీటి ఎద్దడి నెలకొనడడంతో రానున్న వేసవి కాలాన్ని ఊహించుకొని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నీటిలభ్యత, నిధులు వున్నా వాటిని వినియోగించుకోని పరిస్థితి ఉంది. సిపిడబ్ల్యూ స్కీమ్‌ నిర్వహణ సిబ్బందికి సక్రమంగా జీతాలు చెల్లించకపోవడం, నిర్వహణ ఖర్చులు సక్రమంగా ఇవ్వకపోవడంతో సిపిడబ్ల్యూ పథకాలన్ని అటకెక్కుతున్న పరిస్థితి నెలకొంది. జిల్లాలో మొత్తం 628 గ్రామాల్లో తాగు నీటిని అందించేందుకు 57 సిపిడబ్లూస్కీములున్నాయి. వేసవి వచ్చిందంటే ఆ స్కీముల్లో సగం పనిచేయని పరిస్థితి ఎదురవుతోంది. నదుల్లో నీటిలభ్యత పుష్కలంగా ఉంటున్నందున ప్రతి గ్రామానికి తాగునీటిని సక్రమంగా అందించేందుకు ప్రభుత్వం వీలైనన్ని చోట్ల ఎస్‌ఎస్‌ ట్యాంకులను కట్టడం, చెరువుల్లోకి నీటిని మళ్లించడం లాంటి పనులను చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. కరువు ప్రాంతం గుండా వెళ్లే హంద్రీనీవా సుజల స్రవంతి కాల్వ వెంట ఉండే 106 చెరువులకు నీటిని మళ్లించేందుకు సర్వే చేసినా ప్రభుత్వం పట్టించు కోవడంలేదు. దీంతో దాదాపుగా 33 టిఎంసిల నీరు హంద్రీనీవా కాల్వ గుండా వెళ్లిన వాడుకోలేని దుస్థితిని కర్నూలు జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికి చొరవ చూపాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.

Related Posts