YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఈ పాస్ మిషన్ తో సగం మందికే రేషన్

ఈ పాస్ మిషన్ తో సగం మందికే రేషన్

ఈ పాస్ మిషన్ తో సగం మందికే రేషన్
ఏలూరు, ఫిబ్రవరి 14
వేలి ముద్రలు సరిగా లేక ఈ–పాస్‌ మెషిన్‌ వాటిని స్వీకరించక పోవడం, కొత్త రేషన్‌కార్డుల్లో తప్పుల తడకలు తదితర కారణాల వల్ల జనవరి నెలలో 19.92 లక్షల మంది పేదలు రేషన్‌ సరుకులు పొందలేకపోయారు. బియ్యం, చక్కెర, గోధుమలు, గోధుమ పిండి, కిరోసిన్‌ తదితర రేషన్‌ సరుకులపై ఆధారపడి బతుకీడుస్తున్న లక్షలాది మంది వయోవృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, ఏ పనీ చేసుకోలేని వారి పరిస్థితి  సాంకేతికత పుణ్యమా అని దయనీయంగా మారింది.రాష్ట్రంలో 1.38 కోట్ల తెల్లరేషన్‌ కార్డులు ఉంటే ఇలాంటి సమస్యలతో ప్రతి నెలా లక్షలాది మంది పేదలు రేషన్‌కు దూరం అవుతున్నారు. వేలి ముద్రలు సరిగా పడని వారికి గ్రామ రెవెన్యూ కార్యదర్శి (వీఆర్వో) సర్టిఫికెట్‌ ఇస్తే రేషన్‌ ఇస్తామని ప్రభుత్వం చెబుతున్న మాట లు క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదు. రేషన్‌షాపు వరకు నడవలేని వృద్ధులకు వారి ఇంటికే వెళ్లి రేషన్‌ ఇవ్వాలన్న ఆదేశాలు కూడా సరిగా అమలు కావడం లేదు. దీనికి తోడు నగదు రహితంగానే రేషన్‌ ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా తీసుకోవడం కూడా పలు ఇబ్బందులకు కారణమవుతోంది.ఇలా ప్రతి నెలా బ్యాంకులో డబ్బు జమ చేసి ఆ తర్వాత సరుకులు తీసుకోవాలంటే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఈ–పాస్‌ మెషిన్లు సరిగా పనిచేయక గంటల తరబడి రేషన్‌ షాపులవద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో 1.66 లక్షల కొత్తకార్డులు జన్మభూమి కార్యక్రమంలో ఇచ్చామని చెబుతున్నా అందులో సగానికి పైగా కార్డులకు రేషన్‌ నిలిపివేశారనే 

Related Posts