YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆరోగ్యం తెలంగాణ

చికెన్ విక్రయాలపై ఎఫెక్ట్  సగానికి పడిపోయిన ధరలు

చికెన్ విక్రయాలపై ఎఫెక్ట్  సగానికి పడిపోయిన ధరలు

చికెన్ విక్రయాలపై ఎఫెక్ట్ 
సగానికి పడిపోయిన ధరలు
హైద్రాబాద్, ఫిబ్రవరి 14
చికెన్‍ అంటే ఇష్టముండని వారు ఎవరుంటరు? చికెన్‍ నూడుల్స్, చికెన్‍ బిర్యానీ, తందూరీ చికెన్‍… ఇలా చికెన్‍తో ఏదైనా సరే లొట్టలేసుకుంటూ తినేందుకు ముందుంటరు నాన్ వెజ్  ప్రియులు. అలాంటింది ఇప్పుడు చికెన్‍ అంటేనే భయంతో వణుకుతున్నరు. మటన్ మస్తుగా తినేటోళ్లూ దానికి దూరంగా ఉంటున్నరు. ఎందుకంటే… చైనాలో పంజా విసురుతున్న కరోనా వస్తదనే పుకార్లే  కారణమట. జంతువుల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుందనే అపోహలు సోషల్‍ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో చాలామంది నాన్ వెజ్ కు దూరంగా ఉంటున్నరు. ఏమైతదిలె అని అప్పుడప్పుడు చికెన్ తినెటోళ్లు కొందరుంటే, ఎందుకైనా మంచిదని చికెన్‍ కు దూరంగా ఉండేటోళ్లే  ఎక్కువ మంది ఉన్నరు.చైనాలో వచ్చిన కరోనా వైరస్ చికెన్‍, మటన్, చేపలు… ఇలా నాన్ వెజ్ ఏదైనా తింటే వస్తదని వారం, పది రోజులుగా సోషల్‍ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. దీంతో చికెన్ రేట్లు పడిపోతున్నాయి. మొన్నటి వరకు రూ.220 వరకు ఉన్న కిలో చికెన్… ఇప్పుడు రూ.140కి పడిపోయింది. మటన్ ధరలూ అంతే స్థాయిలో తగ్గుతున్నాయి. గిరాకీ కూడా పెద్దగా లేకుండా పోయిందని చికెన్, మటన్ షాపుల  నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘గతంలో రోజూ 200 కిలోల దాకా చికెన్ అమ్మేటోణ్ణి. కానీ కరోనా ఎఫెక్ట్తో 50 కిలోలు కూడా చికెన్ పోతలేదు. చికెన్ కొనేందుకు జనాలు పెద్దగా రావడం లేదు’ అని  ఖైరతాబాద్లోని ఓ చికెన్ షాప్ ఓనర్ చెప్పాడు. కరోనా వస్తుందనే పుకార్లతోనే తినడం లేదని జనాలు చెప్తున్నరు. దీంతో హోటళ్లు కూడా పెద్దగా నడవడం లేదు. అయితే ప్రభుత్వం, డాక్టర్లు మాత్రం చికెన్, మటన్ తినడం వల్ల వైరస్ వస్తుందనేది ఉత్త పుకారేనని, వీటికి కరోనాకు సంబంధమే లేదని చెబుతున్నారు

Related Posts