జిల్లాలోని ప్రతి మండలానికి అంతరిక్ష పరిశోధనా కేంద్రం విజయాలు
- జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి
మంచిర్యాల, ఫిబ్రవరి 13
విద్యార్థినీ విద్యార్థులకు ప్రజలకు అవగాహన కల్పించేందుకు భారతీయ అంతరిక్ష పరిశోధన కేంద్ర విజ్ఞానం ప్రతి మండలానికి చేరుకునేలా స్పేస్ ఆన్ వీల్స్ బస్సు యాత్ర ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటుచేసిన అంతరిక్ష పరిశోధన కేంద్రం బస్సుయాత్ర ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ యాత్ర ఈనెల 13 నుండి 15వ తేదీ వరకు జిల్లాలోని ప్రతి మండలంలో తిరిగి విద్యార్థిని విద్యార్థులకు అంతరిక్ష పరిశోధన విజయాలను తెలియజేస్తుందని తెలిపారు. ఇస్రో నుండి ఈ కార్యక్రమానికి వచ్చిన రామయ్య విద్యార్థులకు విక్రమ్ సారాభాయ్ జీవనవిధానం ఇస్రో రాకెట్ నమూనా, సాటిలైట్ మోడల్స్, లాంచింగ్ ప్యాడ్ లతోపాటు చంద్రయాన్ మంగళగిరి లాంటి రాకెట్లను 1947 నుండి ఇప్పటివరకు అంతరిక్షం కు పంపించడం జరిగిందని అన్నారు. yuvika కార్యక్రమం క్రింద రెండు వారాల పాటు సైన్స్లో విజ్ఞాన పరంగా ప్రతిభ కలిగిన విద్యార్థులకు అంతరిక్ష పరిశోధన కేంద్రాలలో విజ్ఞాన ప్రదర్శన చూపిస్తారని, అర్హత గల వారిని జిల్లా విద్యాశాఖ అధికారి ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందని, భవిష్యత్తులో యువ శాస్త్రవేత్తలు గా ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, విద్యార్థినీ విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. ఆసక్తికర అంశాలు ప్రదర్శించి రాకెట్ ప్రయోగ విధానం వివరించారు. విద్యార్థి దశ నుండే సైన్స్ పరంగా అనేక విషయాలు తెలుసుకోవాలని అన్నారు. ఈ బస్సు యాత్ర లక్షెట్టిపేట దండేపల్లి మండలాలు జరుగుతుందని తెలిపారు. శుక్రవారం రోజున ఉదయం బెల్లంపల్లిలో మధ్యాహ్నం మందమర్రిలో, శనివారం రోజున చెన్నూర్ భీమారం జైపూర్ లో బస్సు యాత్ర కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా సైన్స్ అధికారి మధు బాబు, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్, సంబంధిత శాఖల అధికారులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.