బ్యాంక్ చోరికి విఫలయత్నం
అదిలాబాద్ ఫిబ్రవరి 14
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని స్థానిక కో ఆపరేటివ్ బ్యాంక్ ఏటీఎం చోరీకి విఫలయత్నం జరిగింది. బ్యాంక్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల బుధవారం అర్ధ రాత్రి సమయంలో ఒక దుండగుడు ఆదిలాబాద్ కో అపరేటివ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన ఏటీఎం దగ్గరికి వచ్చి ఏటీఎం తాళాలు పగలగొట్టడానికి ప్రయతించాడు. తాళాలు పగలకపోవడం అలాగే ఏటీఎం ముందు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాను చూసి అతని ముఖం ను కనిపించకుండా వెనకకు నడుచుకుంటూ వెళ్లి సీసీ కెమెరాను తెలివిగా ధ్వసం చేశాడు. ఒక వేళా చోరీ జరిగితే చాలా నష్టం జరిగేదాని తెలిపారు.అయిన కానీ బ్యాంక్ అధికారులు సీసీ ఫుటేజీ ఆధారంగా స్థానిక పోలీస్ స్టేషన్ కు బ్యాంక్ అధికారులు పిర్యాదు చేశారు.