పొలిటికల్ హీట్ పెంచిన ఐటి సోదాలు
విజయవాడ, ఫిబ్రవరి 14
ఆదాయపు పన్ను శాఖ ప్రకటన వైసీపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధానికి తెరదీసింది. రెండువేల కోట్ల అక్రమ లావాదేవీలు చంద్రబాబు బినామీలకు చెందినవేనని వైసీపీ ఆరోపిస్తుంది. చంద్రబాబు అక్రమాలు మూడు లక్షల కోట్లకు చేరుకుంటాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తన బినామీల పేరుతో చంద్రబాబు అక్రమాస్తులను కూడబెట్టారని ఆరోపించారు. మరో వైపు పచ్చ కామెర్ల వారికి లోకమంతా పచ్చగా కనపడినట్లే దేశమంతా అవినీతి జరిగినట్లు జగన్ కు కన్పిస్తుందని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. మొత్తం మీద రెండు పార్టీలకూ ఐటీ దాడులు ఆయుధంగా మారాయి.ఏపీలో ఐటీ సోదాల వ్యవహారం పొలిటికల్ హీట్ పెంచింది. చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో కూడా రైడ్స్ జరగడం.. ఐటీశాఖ ఓ ప్రకటన విడుదల చేయడంతో పెద్ద దుమారమే రేగింది. ఐటీ ప్రెస్‌నోట్ అలా వచ్చిందో లేదో.. ఇలా వైఎస్సార్‌సీపీ చంద్రబాబు అండ్ కోను టార్గెట్ చేసింది. పీఎస్ ఇంట్లోనే అంత డబ్బు దొరికితే చంద్రబాబు దగ్గర లక్షల కోట్లు ఉంటాయని ఆరోపిస్తున్నారు.చంద్రబాబు దోచుకున్న సొమ్మును కేంద్రం కక్కించాలన్నారు ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. తన అవినీతి బయట పడుతుందనే చంద్రబాబు సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకున్నారని.. బాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి దగ్గరనే రూ. 2వేల కోట్ల అవినీతి బయటపడితే.. చంద్రబాబు దగ్గర లక్షల కోట్ల అవినీతి బయటపడుతుందన్నారు. చంద్రబాబు అవినీతిపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎందుకు నోరు మెదపడం లేదని మంత్రి ప్రశ్నించారుచంద్రబాబు, లోకేష్ దేశం విడిచి పారిపోయే ప్రమాదం ఉందన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ. తమ అక్రమాలు బయటపడుతుడటంతో.. దేశం దాటే అవకాశం ఉందని.. చంద్రబాబు, లోకేష్‌ల పాస్ పోర్టులు స్వాధీనం చేసుకోవాలన్నారు. చంద్రబాబు అక్రమాస్తులను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలన్నారు. అమరావతి, పోలవరం పేరుతో కోట్ల రూపాయిల ప్రజాధనాన్ని దోచుకున్నారని.. డొల్ల కంపెనీల పేరుతో అక్రమ లావాదేవీలు నడిపించి కోట్లు వెనకేసుకున్నారని ఆరోపించారు.ఐటీ దాడుల్లో వేల కోట్లు బయటపడినా చంద్రబాబు తేలు కుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నారని విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. 1994 నుంచే డబ్బుతో చంద్రబాబు రాజకీయాలు చేశారని.. బాబు అవినీతిలో పవన్ కల్యాణ్‌కు కూడా భాగం ఉందన్నారు.'పర్సనల్ సెక్రటరీని పట్టుకుంటేనే రూ.2వేల కోట్లు బయటపడ్డాయి. మరి చంద్రబాబును పట్టుకుంటే... ఎన్ని వేల కోట్లో! లక్షల కోట్లు అడ్డంగా సంపాదించారన్నది అక్షరాల నిజం కాదా? ఇంతకన్నా సాక్ష్యాలు ఏం కావాలి' అన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.పీఎస్ ఇళ్లను సోదాలు చేస్తేనే వేల కోట్ల బ్లాక్ మనీ బయటపడింది అన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.వైసీపీ నేతలపై టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. పచ్చ కామెర్ల వారికి లోకమంతా పచ్చగా కనపడినట్లే దేశమంతా అవినీతి జరిగినట్లు జగన్ కు కన్పిస్తుందని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. దేశ వ్యాప్తంగా నలభై చోట్ల ఐటీ శాఖ దాడులు జరిపితే కేవలం 85 లక్షలు మాత్రమే దొరికిందని, విషప్రచారం చేయడం మానుకోవాలని లోకేష్ కోరారు. చంద్రబాబు వద్ద నలభై ఏళ్లలో ఎంతోమంది పర్సనల్ సెక్రటరీగా పనిచేశారని, వారిపై దాడులు జరిగితే చంద్రబాబుకు అంటగట్టడమేంటని మాజీ మంత్రి యనమల ప్రశ్నించారు. మొత్తం మీద రెండు పార్టీలకూ ఐటీ దాడులు ఆయుధంగా మారాయి.