YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

దుర్గా నామ జపం..

దుర్గా నామ జపం..

దుర్గా నామ జపం..
దుర్గా అని పలికితే ఆపదలు ఉండవు. దుర్గా నామం దుఖాలను పోగొడుతుంది. "ఓం దుం దుర్గాయైనమః" ద్ + ఉ + ర్ + గ్ + అ అనే ఐదు బీజాక్షరాలు కలిసిన నామం దుర్గ. 
ద కారం -  దైత్యాన్ని ( మనలో ఉన్న రాక్షస గుణాలను) పోగోడుతుంది. 
ఉ కారం -  మనం అనుకున్న పనులకు విఘ్నాలు రాకుండా చేస్తుంది. 
ర కారం-  రోగాలు రాకుండా రక్షిస్తుంది. 
గ కారం-  మనం చేసిన పాపాలను పోగొడుతుంది.
అ కారం -  శత్రు నాశనం చేస్తుంది. అందుకే దుర్గా అని పలికితే ఆపదలు ఉండవు. దుర్గా నామం దుఖాలను పోగొడుతుంది.
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః !!
శ్రీ దుర్గా ఆపదుద్ధార స్తోత్రమ్ :
1 -నమస్తే శరణ్యే శివేసాను కంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే ! నమస్తే జగద్వంద్య పాదారవిందే నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే !! 
2 - నమస్తే జగచ్చింత్య మానస్వరూపే నమస్తే మహాయెాగి విజ్ఞానరూపే ! నమస్తే నమస్తే సదానంద రూపే నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే !! 
3 - అనాథస్య దీనస్య తృష్ణాతురస్య భయార్తస్య భీతస్య బద్ధస్య జంతోః ! త్వం ఏకా గతి ర్దేవీ విస్తారకర్త్రీ నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే !! 
4 - అరణ్యే రణే దారుణే శత్రుమధ్యే అనలే సాగరే ప్రాంతరే రాజ గేహే ! త్వం ఏకా గతి ర్దేవి నిస్తార నౌకా నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే !! 
5 - అపారే మహాదుస్తరే2 త్యంత ఘోరే విపత్సాగరే మజ్జితాం దేహిభాజామ్ ! త్వం ఏకా గతి ర్దేవీ నిస్తార హేతుర్ నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే !!
6 - నమశ్చండికే చండ దుర్దండ లీలా సముత్ ఖండి తాకండితా శేష శత్రో ! త్వం ఏకా గతి ర్దేవి వినిస్తార బీజం నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే !! 
7 - త్వమేవాఘ భావాధృతా సత్యవాది న్యమే యాజితా క్రోధనాత్క్రోధ నిష్టా ! ఇడా పింగళా త్వం సుషుమ్నాచ నాడీ నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే !! 
8 - నమెా దేవి దుర్గే శివే భీమనాదే సరస్వత్యరుంధత్యమెాఘ స్వరూపే ! విభూతిః శచీ కాళరాత్రీః సతీ త్వం నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే !! 9 - శరణమసి సురాణాం సిద్ధ విద్యాధరాణాం ముని మనుజ పశూనాం దస్యుభిస్త్రాసితానాం ! నృపతి గృహ గతానాం వ్యాధిభిః పీడితానాం త్వమసి శరణమేకా దేవి దుర్గే ప్రసీద ప్రసీద !! -:
ఇతి శ్రీ దుర్గా ఆపదుద్దారక స్తోత్రం సంపూర్ణం :-
అధ్భుతమైన గతిలో నడిచే ఈ స్త్రోత్ర రాజం చదువుతుంటేనే అర్థము స్ఫురిస్తుంది !! ఆనందమును కలిగిస్తుంది !! చదవండి !! చదివి " అమ్మ " కృపకు పాత్రులు కండి.
 ఈ దుర్గా ఆపదుద్దారక స్తోత్రమును పఠించిన యెడల అనేక.. ఆపదలు, ఈతి బాధలు, గ్రహ బాధలు, అత్యంత దుర్గమమైన కష్టాలు మరియు ఘోరమైన వ్యాధులు తొలగి సుఖ సంతోషాలు ప్రాప్తించును.
ఓం శాంతిఃశాంతిఃశాంతిః !! 
శ్రీ మాత్రే నమః

Related Posts