YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 సత్ఫలితాలు ఇస్తున్న భూ వివాదాలు...

 సత్ఫలితాలు ఇస్తున్న భూ వివాదాలు...

 సత్ఫలితాలు ఇస్తున్న భూ వివాదాలు...
వరంగల్, ఫిబ్రవరి 15
భూమి వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపిన సర్కార్ మరో అడుగు ముందుకు వేసింది. భూ రిజిస్ట్రేషన్లను సరళతరం చేసి, పారదర్శకత పెంపొందించాలనే ఉద్దేశంతో మండల రెవెన్యూ అధికారులకూ అధికారాలను కట్టబెట్టింది. దీంతో రిజిస్ట్రేషన్ సౌకర్యాలు సరళీకృతం కావడంతోపాటు భూ సమస్యలు భవిష్యత్‌లో తలెత్తకుండా ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే భూరికార్డుల ప్రక్షాళన పూర్తి చేసింది. ఈ సాహసోపేత నిర్ణయాన్ని ప్రతిఒక్కరూ స్వాగతించారు. ప్రశంసలజల్లు కురిపించారు. ప్రభుత్వ ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టే కుతంత్రాలకు తెరతీశాయి. ఈ కుట్రలపై జిల్లా వ్యాప్తంగా రైతులు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం బాగుందని చెబుతున్నారు. ఈ నిర్ణయం అమలు చేస్తే ఇన్నాళ్లూ తాము పడ్డ ఇబ్బందులు తీరుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ప్రభుత్వ శాఖల ఉద్యోగులూ ఈ నిర్ణయంపై సానుకూలంగా ఉన్నారు. తమకు పనిభారమైనా సరే ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలను ప్రజల ముంగిట ఉంచుతామని చెబుతున్నారు. ఉద్యమస్ఫూర్తితో పనిచేస్తామని, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయంతో సమస్యలు పరిష్కరించుకుంటామని పట్టుదలతో ముందుకెళ్తున్నారు.1930వ దశకంలో నిజాం ఏలుబడిలో భూమి బందోబస్తు నిర్వహించారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా వాటి పరిస్థితిని చక్కబెట్టలేదు. కనీసం అటువైపు కన్నెత్తి చూడలేదు. ఈ పరిస్థితిని రూపుమాపేందుకు, తెలంగాణలో ప్రతీ ఇంచుభూమికీ పక్కాగా లెక్క ఉండాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. మూడు, నాలుగు నెలలపాటు యజ్ఞంలా, మొక్కవోని దీక్షతో భూ రికార్డుల ప్రక్షాళన చేశారు. వరంగల్ అర్బన్ జిల్లాలో 2,86,052 సర్వేనంబర్లను వడపోసి అందులో 1,96,762 సర్వేనంబర్లలో ఉన్న భూము లు వివాదరహితమని తేల్చారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్న ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు యథాతథంగా కొనసాగుతాయని, మిగతా మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. తద్వారా భూ మి అమ్మకందారుడికి, కొనుగోలుదారుడికి సదరు భూమికి సంబంధించి భవిష్యత్‌లో ఎలాంటి చిక్కులూ ఎదురు కావొద్దని భావిస్తున్నారు. ఇందులో పూర్తి పారదర్శక విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయంపై కొన్ని శక్తులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.రెవెన్యూ శాఖకు, భూమికి మనిషికి గుండెకు ఉన్న సంబంధం ఉంటుంది. భూ రికార్డుల వ్యవహారాల్లో గ్రామ సహాయకుడి నుంచి మొదలు కలెక్టర్ వరకు అందరికీ భాగస్వామ్యం ఉంటుంది. భూ వ్యవహారాలు, లావాదేవీలు, మార్పులు, చేర్పులు, సర్వేనంబర్లకు సంబంధించి ఏ కోణంలో చూసినా రెవెన్యూ శాఖకే పవర్‌ఆఫ్ అటార్నీ వర్తిస్తుంది. భూ పంపిణీ నుంచి మొదలుకొని పట్టాదార్ పాస్‌పుస్తకాల ముద్రణ, పన్నుల వసూళ్లు, తదితర అంశాలకు రెవెన్యూ శాఖనే ప్రత్యక్ష బాధ్యతాయుత హక్కుదారు. అతివృష్టి, అనావృష్టి, రైతుకు కలిగే కష్టన ష్టాలు, ప్రయోజనాలను ఈ వ్యవస్థనే చక్కదిద్దుతుంది. భూమికి సంబంధించి సకల అంశాలు రెవెన్యూశాఖకే తెలుస్తాయి. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ శాఖ చేసే భూ క్రయ విక్రయాలను ఇక రెవెన్యూశాఖలోనూ కొనసాగించేలా సర్కార్ నిర్ణయం తీసుకున్నది. రిజిస్ట్రేషన్ శాఖ అనుసరించే, పాటించే విధానంపై రెవె న్యూ యంత్రాంగానికి యుద్ధప్రాతిపదికన శిక్షణ ఇస్తున్నది. భూ బదలాయింపు కోసం రిజిస్ట్రేషన్ శాఖ నుంచి తిరిగి రెవెన్యూశాఖకే వెళ్లాలి. ఈ క్రమంలో మ్యూటేషన్ చేయాలంటే సుదీర్ఘకా లం పడుతోంది. ఈలోపు సదరు భూమిని అమ్మకందారుడు మరొకరికి విక్రయించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రక్రియ ఇలా కొనసాగుతుండగా, భూమి పది మంది హక్కుదారుల చేతులు మారుతోంది. ఈ పరిస్థితిని రూపుమాపాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని రైతాంగం సర్వత్రా స్వాగతిస్తోంది. దశాబ్దాల తరబడి తమకు జరిగిన అన్యాయం భవిష్యత్‌లో జరగకుండా ఉంటుందని భావిస్తోంది.

Related Posts