టీఆర్ఎస్ నాయకుడి దారుణ హత్య
సూర్యాపేట ఫిబ్రవరి 14,
సూర్యాపేట జిల్లాలో హత్యా రాజకీయాలతో రికార్డుల్లో ఉన్న సూర్యాపేట గ్రామీణ మండలం యార్కారం గ్రామం మరోసారి పాత కక్షలతో భగ్గుమంది. గ్రామ మాజీ సర్పంచి, టీఆర్ఎస్ నాయకుడు ఒంటెద్దు వెంకన్న అర్ధరాత్రి దారుణహత్యకు గురయ్యారు. సహకార సంఘ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా కార్యకర్తలతో కలిసి ఉన్న వెంకన్నను ప్రత్యర్థులు తల్వార్లు, గొడ్డళ్లతో వెంబడించారు.ప్రాణభయంతో ఓ ఇంట్లోకి వెళ్లి దాక్కున్న వెంకన్నను తలుపులు పగులగొట్టి అతి కిరాతకంగా హత్య చేశారు.