YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 రెండు పార్టీల మధ్య సెలక్షన్ కమిటీ రచ్చ

 రెండు పార్టీల మధ్య సెలక్షన్ కమిటీ రచ్చ

 రెండు పార్టీల మధ్య సెలక్షన్ కమిటీ రచ్చ
విజయవాడ, ఫిబ్రవరి 15
సెలెక్ట్ కమిటీ కథ ఇక ముగిసినట్లే కనపడుతుంది. రెండు పక్షాలు నిబంధనలతో ఆటాడు కుంటున్నాయి. సీఆర్డీఏ రద్దు, అధికార వికేంద్రీకరణ బిల్లులు శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు నెల రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి ఫైలు ముందుకు కదలలేదు. సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కాలేదు. రెండు పార్టీలు వ్యూహాలతో ముందుకు వెళుతుండటంతో అధికారులు కూడా ఏం చేయలేకపోతున్నారు. సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేయకపోవడంపై శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఫైల్ ను తనకు వెనక్కు పంపండంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేయకపోతే రాజ్యాంగపరంగా చర్యలు తప్పవని షరీఫ్ అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. తాను ఆదేశించినా ఎందుకు కమిటీని ఏర్పాటు చేయడం లేదని షరీష్ అసహనం వ్యక్తం చేశారు.కాగా సెలెక్ట్ కమిటీ ఏర్పాటుపై ఓటింగ్ జరగకపోవడంతో నిబంధనల ప్రకారం చెల్లదని అధికార వైసీపీ చెబుతోంది. పైగా 14 రోజుల్లో బిల్లులపై ఎటువంటి పురోగతి లేకపోతే అది ఆమోదం పొందినట్లేనని వైసీపీ చెబుతోంది. ఇక సెలెక్ట్ కమిటీ లేనట్లేనని వైసీపీ మంత్రులు ధీమాగా చెబుతున్నారు. అయితే మనీ బిల్లులు కాదని, అందువల్ల ఇంకా శాసనమండలిలో ఈ బిల్లులు లైవ్ లో ఉన్నట్లేనని తెలుగుదేశం పార్టీ వాదిస్తుంది.మరోవైపు శాసనమండలి, శాసనసభను ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ప్రభుత్వం ఆర్డినెన్స్ ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అయితే శాసనమండలిలో పెండింగ్ లో ఉన్న బిల్లులపై ఎలా ఆర్డినెన్స్ ను తీసుకొస్తారని టీడీపీ ప్రశ్నిస్తుంది. ఒకవేళ తీసుకొచ్చినా ఆర్డినెన్స్ ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందాల్సిందేనంటున్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలతో పాటు మండలి సమావేశాలు కూడా జరపాల్సిందేనని, ఇది రాజ్యంగం చెప్పిన సూత్రమని టీడీపీ నేతలు గట్టిగా వాదిస్తున్నారు. మొత్తం మీద సెలెక్ట్ కమిటీ వ్యవహారంలో రెండు పార్టీలు పంతాలకు పోవడంతో ఎటూ తేలకుండా ఉంది.

Related Posts