YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 విద్యుత్ చార్జీలు తో కొందరిపైనే భారం

 విద్యుత్ చార్జీలు తో కొందరిపైనే భారం

 విద్యుత్ చార్జీలు తో కొందరిపైనే భారం
శ్రీకాకుళం, ఫిబ్రవరి 15,
ఏప్రిల్‌ నుంచి అమల్లోకి వస్తున్న కొత్త టారిఫ్‌తో సామాన్యులకు మేలు జరగనుంది. ముఖ్యంగా అద్దె ఇళ్లల్లో ఉన్న వారికి భారం తగ్గనుంది. ఇంతవరకు గత సంవత్సరం వినియోగించిన విద్యుత్‌ ఆధారంగా ఈ సంవత్సరం శ్లాబ్‌ నిర్ణయించేవారు. దీని వల్ల అద్దె ఇళ్లల్లో తరుచూ మారేవారు పెద్ద ఎత్తున భారాన్ని మోయాల్సి వచ్చేది. ఇప్పుడా పరిస్థితి లేదు. నెలలో ఎంత వినియోగిస్తే అంతే చార్జీలు పడనున్నాయి. 500 యూనిట్లు దాటి వినియోగిస్తే కాసింత భారం పడనుంది. ఈ రకమైన భారాన్ని మోసేవారి సంఖ్య ప్రతి నెల 975లోపే ఉంటుంది.   కొత్త విద్యుత్‌ టారిఫ్‌తో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు లబ్ధి చేకూరుతున్నా అదేదో భారం మోపుతున్నట్టు గగ్గోలు పెడుతున్నాయి. విద్యుత్‌ సంస్థలను కాపాడుకునేందుకు ఉన్నతాదాయ వర్గాలపై కాసింత భారం వేస్తే దాన్ని భూతద్దంలో చూపిస్తున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకా రం సామాన్య, మధ్య తరగతి వర్గాలపై భారం మోపకుండా విద్యుత్‌ కొత్త టారిఫ్‌ను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమల్లోకి తెస్తున్నారు. 500యూనిట్లు దాటి వినియోగించే వారికి మాత్రమే కాసింత భారం పడేలా నిర్ణయం తీసుకున్నారు.విద్యుత్‌ చార్జీలపై ఆ మధ్య ప్రజల నుంచి జిల్లా నియంత్రణ మండళ్లు వినతులు స్వీకరించాయి. అయినప్పటికీ విద్యుత్‌ చార్జీలు పెంచుతారేమోనని ప్రజలంతా భయపడ్డారు. వాస్త వంగా గృహ వినియోగ సర్వీసులపై కొంతమేర చార్జీలు పెంచాలని, అభివృద్ధి చార్జీలు తదితర వాటిపై ఈపీడీసీఎల్‌ నుంచి ప్రతిపాదనలు వెళ్లాయి. కానీ వైఎస్‌ జగన్‌ సర్కార్‌ 500 యూనిట్లు దాటి వినియోగించే ఉన్నతాదాయ వర్గాలపైనే కాసింత భారం పడేలా నిర్ణయం తీసుకున్నారు. 500 యూనిట్లకు పైన వినియోగించే వారిపై యూనిట్‌కు 90 పైసలు చొప్పున భారం పడనుంది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి కొత్త టారిఫ్‌ అమల్లోకి రానుంది.  జిల్లాలో గృహ వినియోగ సర్వీసులు 8,35,745 ఉండగా వీటిలో ప్రతి నెలా 500 యూనిట్లు వాడే సర్వీసుల సంఖ్య 975 మాత్రమే ఉంది. మొత్తం గృహ వినియోగదారుల్లో 0.11శాతం మాత్రమే. వీరికి మాత్రమే కాసింత భారం పడుతుంది. సాధారణంగా గత ఆర్థిక సంవత్సరంలో వినియోగించిన విద్యుత్‌ ఆధారంగా టారిఫ్‌ వర్తిసుంది. ఎక్కువ యూనిట్లను వాడితే ఆ లెక్కన తర్వాత ఆర్థిక సంవత్సరంలో శ్లాబ్‌ ఉంటుంది. సాధారణంగా వేసవిలో విద్యుత్‌ వినియో గం ఎక్కువగా ఉంటుంది. ఏసీలు, ఫ్రిజ్‌లు, కూలర్లు, ఫ్యాన్ల వినియోగం ఎక్కువగా ఉండటం వల్ల వినియోగం పెరుగుతుంది. అదే వర్షాకాలం, శీతాకాలం వచ్చేసరికి వినియోగం తగ్గిపోతుంది. అయితే ఈ వ్యత్యాసాన్ని గమనించకుండా గత ప్రభుత్వం అడ్డగోలుగా టారిఫ్‌ను నిర్ణయించింది. ముందటి ఏడాది వినియోగం ప్రకారం ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి శ్లాబ్‌ నిర్ణయించడం జరిగేది. దీంతో ఏడా దంతా ఒకే పొడవునా శ్లాబ్‌ చార్జీలు భరించాల్సి ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేకుండా ఏ నెల ఎంత వినియోగిస్తే అంతమేరకు బిల్లింగ్‌ జరగనుంది. ఉదాహరణకు ఈ నెలలో వినియోగం 50 యూనిట్లలోపు ఉంటే దాని ప్రకారమే తదుపరి నెల బిల్లింగ్‌ జరుగుతుంది. నెల వారీగా బిల్లులు మారుతుంటాయి.  ప్రభుత్వ పాఠశాలలకూ, వసతి గృహాలకూ విద్యుత్‌ చార్జీల్లో రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో యూనిట్‌కు రూ. 7.20చొప్పున వసూలు చేసేవారు. ఇకపై యూనిట్‌కు రూ. 7మాత్రమే వసూలు చేయనున్నారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వ విద్యా సంస్థలకు కొంత ప్రయోజనం చేకూరనుంది. 20పైసలు మేర రాయితీ లభించనుంది.  ఈ విధంగా దాదాపు 450 సంస్థలకు మేలు జరగనుంది.

Related Posts