టైటిల్ - చిన్న సినిమాల్లో 'చీమ' సినిమా వేరు!
"చీమ - ప్రేమ మధ్యలో భామ! " సినిమా దర్శకుడు శ్రీకాంత్ "శ్రీ" అప్పలరాజు మాట్లాడుతూ "మనుషులలో మంచి మనుషులు వేరు - చిన్న సిమిమాలలో 'చీమ' సినిమా వేరు. అంటే ఒక వెరైటీ, ఒక నావేల్టీ - అదేంటో తెలియాలంటే మా ' చీమ ప్రేమ మధ్యలో భామ! ' సినిమాను దగ్గరున్న థియేటర్లో చూడాలి - ఫిబ్రవరి 21విడుదల" అన్నారు. నిర్మాత లక్ష్మీనారాయణ మాట్లాడుతూ "ఈనాటి యూవతీయువకులు ప్రేమ విషయంలో ఎంత పరిణతితో ఉన్నారో తెలియచెప్పే చిత్రం ఇది. కాలం మారినా నిజమైన ప్రేమ స్వచ్ఛంగా అన్నిపరీక్షలకు అతీతంగానే ఉంటుంది! అని తెలియ చేయడానికే మా ఈ చిన్న ప్రయత్నం" అని అన్నారు. హీరో అమిత్ " ఈ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలో హీరో పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది, ఎప్పటికీ గుర్తుండిపోతుంది! " అన్నారు