హైదరాబాద్ లో మై క్యాబ్ ఇస్ సేఫ్ కార్యక్రమం
హైదరాబాద్ ఫిబ్రవరి 14,
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో మై క్యాబ్ ఇస్ సేఫ్ కార్యక్రమం ప్రారంభమయింది. నగర ట్రాఫిక్ పోలీసు అదనపు కమిషనర్ అనిల్ కుమార్ ఈ కార్యక్రమానికి హజరయ్యారు. అనిల్ కుమార్ మాట్లాడుతూ మై క్యాబ్ ఇస్ సేఫ్ కార్యక్రమంలో ట్రాఫిక్ ఓనర్స్, డ్రైవర్స్ తో పాటు ప్రయాణికులకు అవగాహన కలిపిస్తున్నం. అందరికీ సురక్షితమైన ప్రయాణం మన అందరి బాధ్యత అని అన్నారు. క్యాబ్ ఓనర్స్ డ్రైవర్స్ ప్రయాణికులను సురక్షితంగా తమ గమ్య స్థానాలకు చేర్చండి. మహిళలు క్యాబ్ లో ప్రయాణం చేసేటప్పుడు మన తోబుట్టులనీ ఆలోచించాలి. సిటీ ట్రాఫిక్ పోలీసు తరుపున క్యాబ్ వెహికల్స్ కి మై క్యాబ్ ఈస్ సేఫ్ అనే స్టిక్క ర్ లను అందజేస్తున్నాం. ఈ విధానం వల్ల ముఖ్యంగా మహిళలు ప్రయాణ చేసే సమయంలో అపద కలిగితే అన్ని విధాలా భద్రతా కలుగ జేస్తుపన్నాం. ప్రైవేట్ టాక్సీ లకు ట్రాఫిక్ పోలీసు లు అందజేసే మై క్యాబ్ ఇస్ సేఫ్ అనే స్టిక్కర్లు కారులో నిర్భయంగా మహిళలు ప్రయాణం చేయొచ్చు. మై క్యాబ్ ఈస్ సేఫ్ అనే కార్యక్రమం మెట్రో నగరం అంతటా విస్తరిస్తున్నామని అయన అన్నారు.