కొండంత నిరాశ మిగిల్చిన
వరల్డ్ ఫేమస్ లవర్
Review by P.V. Rama Mohan Naidu: ప్రేమికుల కతఅంశంతో తీసి ప్రేమికుల రోజునే సీడుదల చేసిన విజయ్ దేవరకొండ హీరోగా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం ఏమి బాగోలేదు. ప్రేక్షకులను, దేవరకొండ అభిమానులను విపరీతంగా నిరాశపరిచింది. విజయ్ దేవరకొండ కెర్ర్ర్ గ్రాఫ్ లో ఈ సినిమా అతి పెద్ద అపజయం. డిజాస్టర్. సినిమా పెద్ద బోరింగ్.మొదటి సగం విసుగు అంటే, రెండో సగం దానిని మించి పరమ విసుగు పుట్టించింది. మొత్తమ్ సినిమాలో హీరోయిన్ ను హీరో కాలేజీ లో ముద్దు పెట్టుకొనే సన్నివేశం ఒక్కటే కాస్త బాగుంది. ఈ సీన్ కు యువ ప్రేక్షకులు నుంచి మంచి స్పందన వచ్చింది. సినిమా మొత్తంలో ఫోటోగ్రఫి ఒక్కటే బాగుంది. కథానాయికలు రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్ లు బాగా నటించారు. ఎడిటింగ్, ఆర్ట్, కాస్ట్యూమ్స్, అన్నీ గొర్రె తోక బెత్తడు లాగే ఉన్నాయి. నేపథ్య సంగీతం కథాగమనానికి ఏమాత్రం ఉపయోగ పడలేదు. అయితే ఒక్కపాట బాగుంది. కథ, కథనం, దర్శకత్వం, నిర్మాణ విలువలు పర్వాలేదు. పెట్టిన ఖర్చు తెరమీద కనపడింది. . ప్లస్ పాయింట్లు రెండే రెండు అది విజయ్ దేవరకొండ నటన ఒకటి కాగా ఫోటోగ్రఫీ రెండవది. . కథలో దమ్ము లేనిదే ఎంతటి నటుడు, ఎంతటి కెమేరామ్యాన్ ఏమీ చేయలేడంటానికి ఈ సినిమానే ఉదాహరణ. లవర్ బాయ్ ఇమేజి వున్నా వాళ్లకి ప్రజాధారణ చాలా తక్కువ కాలమే ఉంటుంది. సదరు నటుడుకి పెళ్లయినా, మరో కొత్త రొమాంటిక్ హీరో వెలుగులోకి వచ్చినా ఇతనిని మరచి పోతారు. రాజేష్ ఖన్నాయే, మినహాయింపు కాలేదు. అతను కారు బయట నిలిపి స్థూడియోకి వెళ్లి వచ్చేసరికి కాలేజీ అమ్మాయిలు తమ లిప్స్టిక్ పెదవులతో ముద్దుల ముద్రలతో కార్టూను నింపేసారట. ఆనక రాజేష్ ఖన్నా దింపులే కాపాడియాను పెళ్లాడిన వార్త బయటకి రాగానే ఆయన సినిమాల వైపు చూసిన వారు లేరు. ఒక్క హిట్ కోసాం రాజేష్ ఖన్నా తపించిపోవలసి వచ్చింది. ఈ సమస్య గుర్తించే కమల్ హాసన్ వైవిధ్యమున్న పాత్రలను ఎంచుకొని చేసాడు. పదునారు వయధినిలై, సిగప్పు రొజాగళ్ళు (ఎర్రగులాబీలు) సాగర సంగమం, స్వాతి ముత్యం ఈ కోవలో ఎంచుకున్న కథాంశాలే. తరుణ్, ఉదయ్ కిరణ్ లకు సైతం మొదటిలో మంచి ప్రేక్షకాదరణ లభించింది. క్రమేపి అదికాస్తా మందగించింది. తరుణ్, రాజా ( ఆనంద్ ఫెమ్) దాదాపు ఖాళీగా కూర్చుని వున్నారు. విజయ్ దేవరకొండ కూడా కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి.వేగంగా మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కథలను, సాంకేతిక విలువలను ఆయన పోగేసుకున్నప్పుడే ఈ పోటీ ప్రపంచంలో మరింత ముందుకు దూసుకు పోగలడు.
|