YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

దిశ, మండలి బిల్లులు రద్దుకు ఓకే

దిశ, మండలి బిల్లులు రద్దుకు ఓకే

 దిశ, మండలి బిల్లులు రద్దుకు ఓకే
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన షెడ్యూల్ మారింది. వాస్తవానికి సీఎం శనివారం హస్తిన నుంచి బయల్దేరి ఏపీకి రావాల్సి ఉన్నా.. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అపాయింట్‌మెంట్ ఖరారు కావడంతో చివరి నిమిషంలో సీన్ మారిపోయింది. రవిశంకర్‌తో మధ్యాహ్నం జగన్ సమావేశంకానున్నారు. రవిశంకర్‌తో భేటీలో ప్రధానంగా శాసనమండలి రద్దు, కర్నూలుకు హైకోర్టు తరలింపుతో పాటూ దిశ చట్టంపై చర్చించనున్నారు.న్యాయశాఖ మంత్రితో భేటీలో ప్రధానంగా మండలి రద్దు, కర్నూలుకు హైకోర్టు తరలింపుపై చర్చించనున్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే మండలి బిల్లుకు ఆమోదం తెలపాలని.. అలాగే హైకోర్టును కర్నూలు తరలించేందకు వీలుగా సహకరించాలని కోరనున్నారు. అలాగే దిశ చట్టాన్ని కూడా ఆమోదించాలని విజ్ఞ‌ప్తి చేయనున్నారు.ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాలను కలిసిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో పాటూ పలు కీలక విషయాలపై వారితో చర్చించారు. పోలవరం, రాజధానికి, వెనుకబడిన జిల్లాలకు నిధులు.. ప్రత్యేక హోదా, మూడు రాజధానులు, శాసనమండలి రద్దుపై ప్రధానంగా భేటీలో ప్రస్తావనకు వచ్చాయి. అలాగే దిశ చట్టం, విభజన సమస్యలు, పెండింగ్ నిధులపైనా చర్చించారు

Related Posts