విద్యార్థులు కడుపు మాడిస్తున్న మధ్యాహ్న పథకం
కౌతాళం ఫిబ్రవరి 15
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్నం భోజనాలు పెట్టకుండా కడుపుమాడిస్తున్న రు అని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతి రోజు సరిగ్గా కొంతమంది పిల్లలకు సరియైన భోజనం దొరకటం లేదని తమ బాధను వ్యక్తం చేశారు. ఉన్నత పాఠశాలలో బోజనాలు పెడతారని వేరే గ్రామలనుంచి వచ్చిన సరియైన సౌకర్యాలు కల్పించడం లో అధికారులు, మండల నాయకులు విఫలమయ్యారు అని ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం ఇంకా30 మంది పిల్లలకు భోజనాలు అందలేదని, హోటల్ తిందామంటే డబ్బులు లేక ఇంటికి వెల్దాము అనుకుంటే 3 నుంచి 10 కిలోమీటర్ల దూరమని మంచినీళ్లే తాగి కడుపు నింపుకుంటున్నామని అధికారులు నిర్లక్ష్యం అని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని పిల్లలకు కడుపు నిండా భోజన వసతి కల్పించాలని కోరారు.