YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

టీడీపీవి తప్పుడు ఆరోపణలు

టీడీపీవి తప్పుడు ఆరోపణలు

టీడీపీవి తప్పుడు ఆరోపణలు
విశాఖపట్నం ఫిబ్రవరి 15
జగన్ మోదీని కలవడం పై టీడీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ సహ ఇంచార్జి సునీల్ దియోధర్ అన్నారు.దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలను బీజేపీ ఒకేలా చూస్తుందని,రాష్ట్రాల పట్ల మాకు ఎలాంటి పక్షపాతం లేదని చెప్పారు.ఏపీలో మేము జనసేనతో కలిసి ముందుకెళ్తున్నామని,వైసీపీతో మాకెలాంటి పొత్తు లేదని,టీడీపీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పారు.చంద్రబాబు రాజకీయ నాయకుడి నుంచి నటుడిగా మారుతున్నారని,ముఖ్యమంత్రి, కేంద్రంలో ఉన్న ప్రధాని, కేంద్ర మంత్రులతో సమావేశం కావడం సర్వసాధారణమని అయితే దీన్ని కూడా రాజకీయం చెయ్యడం సరికాదని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల పరిశ్రమలు వెనక్కి పోయే పరిస్థితి నెలకొందని,ఏపీ  ఆర్ధిక పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతోందని అన్నారు.న్యాయంగా ఏపీకి జరగాల్సిన సహకారం కేంద్రం అందిస్తుందని అన్నారు.సిఏఏ బిల్లు పై మెజార్టీ రాజకీయపార్టీలు మాకు మద్దతిచ్చాయని,కానీ రాష్ట్రాల్లో ధ్వంధ వైఖరి అవలంభిస్తున్నారని అన్నారు.ఏపీలో ఓట్లను కొనుగోలు చేయడంలో చంద్రబాబే మొదటి వ్యక్తిగా ఉన్నారని,ఒకటే రాష్ట్రం ..ఒకటే రాజధాని మా నినాదమని అన్నారు.

Related Posts