YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బాబు అవినీతి బయటపడింది

బాబు అవినీతి బయటపడింది

బాబు అవినీతి బయటపడింది
కర్నూలు ఫిబ్రవరి 15  
అవినీతి సంపాదన కోసమే చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం అంటూ హడావిడి చేశాడు. చంద్రబాబు అవినీతి డొంక కదులుతోంది. బాబు అవినీతి ఫలితంగానే అతని పిఏ ఇంట్లో రెండు వేల కోట్ల అవినీతి  బయటపడిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. కర్నూలు జిల్లాలో అక్రమాలు చేస్తాం, సన్మానం చేయండి  అన్నట్టు కెయి కుటుంబం వ్యవహరిస్తోంది. నకిలీ మద్యం కేసులో వాస్తవాల ఆధారంగానే పోలీసులు వ్యవహరించారు. డోన్ టీడీపి ఇన్చార్జ్ కెయి ప్రతాప్ ఇంట్లో 23 క్యాన్ల నకిలీ మద్యం దొరికింది వాస్తవమే కదా అని ప్రశ్నించారు. అవినీతిపరులు, అక్రమార్కులు పట్టుబడక తప్పదు. పోలీసు అధికారులపై ప్రభుత్వం ఒత్తిడి చేయడం అన్నది అవాస్తవం. పవన్ కళ్యాణ్ ఒక గెస్ట్ రోల్ ప్లే చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని అయన అన్నారు.

Related Posts