స్కూలు బస్సులో మంటలు
-నలుగురు చిన్నారులు సజీవదహనం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15
అత్యంత హృదయవిదాకర ఘటన శనివారంనాడు చోటుచేసుకుంది. పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లా లోంగోవాల్ టౌన్‌లో ఓ స్కూలు బస్సు మంటల్లో చిక్కుకుంది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న నలుగురు చిన్నారులు అగ్నికి ఆహుతయ్యారు. మరో 8 మందిని చుట్టుపక్కల ఉన్నవారు సకాలంలో బస్సు నుంచి బయటకు తీయడంతో వారు ప్రాణాలతో బయటపట్టారు. బస్సులో మంటలు చెలరేగడానికి కారణాలు ఇంకా తెలియలేదు. స్కూలు నుంచి ఇంటికి పిల్లలు తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. స్కూలు పిల్లలంతా 10 నుంచి 12 ఏళ్ల లోపువారే. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే హుటాహుటిన పోలీసు బృందం అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది.