YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'రంగస్థలం' సినిమాకి హైలైట్ గా ఇంటర్వెల్ బ్యాంగ్ !!

'రంగస్థలం' సినిమాకి హైలైట్ గా ఇంటర్వెల్ బ్యాంగ్ !!

రామ్ చరణ్, సమంత జంటగా వస్తున్న చిత్రం రంగస్థలం. ఈ సినిమాలో ఇప్పటికే ప్రోమోలు, పాటలు విడుదల అయ్యి ప్రేక్షకుల ఆదరణ విశేషంగా వచ్చింది. రామ్ చరణ్, సమంత కొత్త తరహాలో కనిపిస్తున్న ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్ గా నిలుస్తుందని, కథ కీలకమైన మలుపు ఇక్కడే తిరుగుతుందని, ఈ మలుపు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తుందనీ, ప్రతి ఒక్కరిలో ఉత్కంఠను రేకెత్తిస్తుందని దర్శకుడు సుకుమార్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక పొతే సంగీతం దేవిశ్రీ, రత్నవేలు సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్లస్ అని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఎక్కువ థియేటర్స్ లో భారీస్థాయిలో విడుదలవుతోన్న ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయమనేది అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts