YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం విదేశీయం

 మార్స్, మూన్ పై ఇళ్లకు రెడీ

 మార్స్, మూన్ పై ఇళ్లకు రెడీ

 మార్స్, మూన్ పై ఇళ్లకు రెడీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17,
చందమామపైకి మనుషులు పోయి సెటిలైతే.. ఎసొంటి ఇండ్లు కట్టుకుంటరు? అంగారకుడిపైకి పోతే కట్టుకునే ఇండ్లు ఎట్లుంటయి? సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసినట్టు పెద్ద పెద్ద మెషిన్లు, ఆకాశంలో తిరిగే ఫ్లయింగ్ వెహికిల్స్, గట్టి మెటల్స్, అద్దాలతో కట్టిన భారీ బిల్డింగులు ఉంటయా? ఇవేవీ ఉండవంట. మెటల్స్, అద్దాలు, కాంక్రీట్ బిల్డింగులకు బదులుగా ఫంగి (బూజు), బ్యాక్టీరియా వంటి జీవులనే ఇటుకలు, గోడలుగా మార్చి కట్టిన ఇండ్లే ఉండొచ్చట. ఎందుకంటే.. మూన్, మార్స్‌‌‌‌లపై గ్రీన్ హౌస్‌‌‌‌లను నిర్మించే దిశగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఇప్పటికే ఓ ప్రాజెక్టును వేగవంతం చేసింది. ‘నాసా ఇన్నోవేటివ్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ (ఎన్ఐఏసీ)’ అనే ఈ ప్రోగ్రాం కింద వివిధ రూపాల్లోని సూక్ష్మజీవులనే స్పేస్‌‌‌‌లో బిల్డింగ్ టెక్నాలజీని వాడుకునేందుకు రీసెర్చ్ జరుగుతోంది.  ఇప్పటివరకూ వేరే గ్రహాలపై తాబేలు బొచ్చెను బోర్లించినట్టుగా ఉండే ఇండ్లను కట్టుకోవడంపైనే అనేక రీసెర్చ్‌‌‌‌లు జరిగాయి. కానీ వీటికి ఖర్చుతో పాటు ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. అందుకే తాము ఫంగస్ మైసీలియాతో ఇండ్ల నిర్మాణంపై ఫోకస్ పెట్టామని ‘మైకో ఆర్కిటెక్చర్ ప్రాజెక్టు’ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ లిన్ రోషిల్డ్ వెల్లడించారు.మన ఇండ్లలో రొట్టెలు, బ్రెడ్ వంటి వాటిపై తెల్లగా, బూడిద రంగులో ఏర్పడే బూజులే ఫంగస్‌‌‌‌లు. వానాకాలం చెత్తకుప్పలపై పెరిగే పుట్టగొడుగులు కూడా ఫంగస్‌‌‌‌లే. ఫంగస్‌‌‌‌లు ఆర్గానిక్ మెటీరియల్ ను తింటూ పెరుగుతాయి. స్పోర్స్‌‌‌‌ను ఉత్పత్తి చేస్తాయి. ఆ స్పోర్స్ కొత్త ఫంగస్‌‌‌‌లుగా పెరుగుతాయి. అయితే మొక్కలకు కాండాలు, కొమ్మలు పెరిగినట్లే.. ఫంగస్ లకు తెల్లని, నల్లని దారాల్లాంటి బూజులు పెరుగుతాయి. వీటినే మైసీలియం అంటారు. ఇవి చాలా సంక్లిష్టంగా, ఒక మంచి నెట్‌‌‌‌వర్క్‌‌‌‌గా పెరుగుతాయి. ఇవి తేలికగానే కాకుండా, గట్టిగా కూడా ఉంటాయి. వీటికి ఆధారంగా ఉండే వస్తువును బట్టి దాని చుట్టూ ఏ ఆకారంలోనైనా పెరిగి, గట్టిపడతాయి. మైసీలియంను క్రియారహితం (డార్మెంట్) చేసి, భూమి నుంచి మార్స్‌‌‌‌కు తీసుకెళ్లొచ్చు. అక్కడికెళ్లాక దీనిని ఫ్రేమ్‌‌‌‌లలోకి ఎక్కించి, నీటిని, పోషకాలను అందిస్తే చాలు.. ఫ్రేమ్‌‌‌‌లలో ఒక పద్ధతి ప్రకారం పెరుగుతూ పోతుంది.మూన్, మార్స్‌‌‌‌పై ఇండ్లను కట్టేందుకు ఫంగల్ మైసీలియంతో గోడలు నిర్మిస్తారు. ఈ గోడలు మూడు లేయర్లలో ఉంటాయి. మార్స్‌‌‌‌పై దొరికే వాటర్ ఐస్‌‌‌‌తో అన్నింటికంటే బయటివైపు లేయర్ ను ఏర్పాటు చేస్తారు. వాటర్ ఐస్ లేయర్ కింద సయనోబ్యాక్టీరియా లేయర్ ఉంటుంది. దీని కింద ఫంగల్ మైసీలియం లేయర్ ఉంటుంది. ఫంగస్ లు బతికేందుకు అవసరమైన పోషకాలను సయనోబ్యాక్టీరియాలే తయారు చేస్తాయి. ఇవి వెలుతురును గ్రహించి ఫోటోసింథసిస్ ద్వారా నీరు, కార్బన్‌‌‌‌డయాక్సైడ్‌‌‌‌, ఆక్సిజన్, ఫంగస్ ఫుడ్‌‌‌‌ను తయారు చేస్తాయి. వాటర్ ఐస్ లేయర్ నుంచి సయనో లేయర్‌‌‌‌కు కావలసిన వెలుతురు, నీరు అందుతాయి. దీంతో సయనో లేయర్ నుంచి అందే పోషకాలను వాడుకుంటూ ఫంగస్ లు పెరుగుతాయి. అవి ప్రత్యేక ఫ్రేమ్‌‌‌‌లలోనే పెరుగుతాయి కాబట్టి.. మనకు ఎలా కావాలంటే ఆ ఆకారంలో గోడ రెడీ అవుతుంది. వాటర్ ఐస్ లేయర్ రేడియేషన్ లోపలికి రాకుండా అడ్డుకుంటుంది. సయనో లేయర్ నుంచి ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ ఆస్ట్రోనాట్లకు ఉపయోగపడుతుంది. మనకు కావలసిన ఆకారంలోకి మైసీలియం పెరిగిన తర్వాత దానిని చనిపోయేలా చేస్తారు. దీంతో అవి గట్టిపడి అలాగే ఉండిపోతాయి. మైకో ఆర్కిటెక్చర్ అంటే జస్ట్ గోడలు మాత్రమే కాదు. మూన్, మార్స్ పై ఇండ్లలో వాడుకునేందుకు ఫర్నీచర్ కూడా తయారు చేసుకోవచ్చట. రీసెర్చ్‌‌‌‌లో భాగంగా నాసా సైంటిస్టులు కూర్చునేందుకు ఉపయోగపడే ఒక స్టూలును తయారు చేశారు. ఒక ఫ్రేమ్‌‌‌‌పై స్టూలు ఆకారంలో మైసీలియం పెరిగేందుకు రెండు వారాలు పట్టిందట. అలాగే మైసీలియం, సాలిడ్ వేస్ట్, కట్టె ముక్కల వంటివి కలిపి గట్టి ప్రొటోటైప్ ఇటుకలను కూడా నాసా సైంటిస్టులు తయారు చేశారు. అయితే, మార్స్ వాతావరణంలోకి ఫంగి చేరితే అక్కడి సూక్ష్మజీవులకు హాని కలగొచ్చు. అందుకే దీనిని మార్స్ అట్మాస్పియర్లోకి చేరకుండా జాగ్రత్తలు కూడా తీసుకోనున్నారు. ఒకవేళ పొరపాటుగా మైసీలియం మార్స్ మట్టిలోకి చేరినా, అవి అక్కడి వాతావరణంలో బతకకుండా ఉండేలా జెనెటికల్‌‌‌‌గా ముందే మార్పులు చేయనున్నారు.మూన్, మార్స్‌‌‌‌పై ఉండే క్లిష్టమైన వాతావరణంలో సేఫ్గా జీవించేందుకు ఫంగస్‌‌‌‌తో ఇండ్లు కట్టడమే సరైన పరిష్కారమని నాసా సైంటిస్టులు స్పష్టం చేస్తున్నారు. మైసీలియంను నీటిని ఫిల్టర్ చేసేందుకూ ఉపయోగించొచ్చని చెప్తున్నారు. బయోమైనింగ్ ప్రాసెస్ ద్వారా వేస్ట్ వాటర్ నుంచి మినరల్స్‌‌‌‌ను సేకరించేందుకు కూడా వాడొచ్చని అంటున్నారు. మిణుగురుపురుగుల్లో వచ్చే నేచురల్ లైట్ మాదిరిగా కాంతిని వెదజల్లేలా కూడా వీటిని మార్చొచ్చని పేర్కొంటున్నారు. అలాగే ఇండ్లలో తేమను కంట్రోల్ చేయొచ్చని, ఇంటి గోడలకు ఎక్కడైనా కన్నం పడితే.. అక్కడ ఆటోమేటిక్ గా ఫంగస్ పెరిగి, గోడ బాగయ్యేలా కూడా చేయొచ్చని వివరిస్తున్నారు. ఇండ్లు కట్టేందుకు మెటల్స్, ఇతర మెటీరియల్స్‌‌‌‌ను భూమి నుంచి తీసుకెళ్లడం చాలా కష్టం. కానీ మైసీలియంను తీసుకెళ్లి అక్కడ ఇండ్లు కట్టుకోవడం ఈజీ అవుతుందని, ఖర్చు కూడా చాలావరకూ తగ్గిపోతుందని అంటున్నారు.

Related Posts