YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆస్తి-పాస్తులు తెలంగాణ

ఏడేళ్ల తర్వాత పెరగనున్న రిజిస్ట్రేషన్లు విలువ

ఏడేళ్ల తర్వాత పెరగనున్న రిజిస్ట్రేషన్లు విలువ

ఏడేళ్ల తర్వాత పెరగనున్న రిజిస్ట్రేషన్లు విలువ
పాలమూరు, ఫిబ్రవరి 17
మ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో జడ్చర్ల, మహబూబ్‌నగర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో భూములు, ప్లాట్లకు మార్కెట్‌ విలువ అత్యధికంగా పెరగనున్నట్లు విశ్వసనీయ సమాచారం. భూములు, ప్లాట్ల క్రయవిక్రయాలు ఎక్కువగా అయ్యే ప్రాంతాల్లో మార్కెట్‌ విలువను అమాంతం పెంచేందుకు అధికారులు ప్రతిపాదనలు చేసినట్లు తెలిసింది. మిగతా ప్రాంతాల్లో 50 నుంచి వందశాతం పెరగనున్నట్లు తెలుస్తోంది. వనపర్తి జిల్లా పరిధిలోని రెండు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉండగా ఇక్కడ 60 నుంచి 100శాతం పెరగవచ్చునని ప్రభుత్వం ఎప్పుడు పెంచుతుందనే సమాచారంలేదని వనపర్తి సబ్‌ రిజిస్ట్రార్‌ ఖుషియా బదర్‌ తెలిపారు.  మార్కెట్‌ విలువ పెంచే విషయాన్ని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఏడేళ్ల తర్వాత తెరపైకి తీసుకువచ్చింది. నిబంధనల ప్రకారం.. ప్రతి రెండేళ్లకు ఒకసారి భూములు, ప్లాట్ల విలువను పెంచాల్సి ఉంది. ఆయా జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయాల నుంచి ప్రభుత్వానికి ఇదివరకు రెండుసార్లు ప్రతిపాదనలు పంపించినా మార్కెట్‌ విలువ పెంచలేదు. నెలరోజుల నుంచి ప్రభుతం ఈ విషయంపై క్షేత్రస్థాయి అధికారులతో ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవటం, తరచూ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతిపాదనలు తెప్పించుకుంటున్న ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీ నుంచే పెంచాలనుకుంది. కానీ కొన్నిమార్పులు చేయాలనే ఉద్దేశంతో మరికొంత సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఇదివరకే తరి, మెట్ట  భూములకు వేర్వేరు మార్కెట్‌ విలువ ఉండేది. ప్రస్తుతం పెంచే మార్కెట్‌ విలువరేట్లలో అన్నిరకాల భూములకు, ప్లాట్లకు ఒకే రకమైన మార్కెట్‌ విలువను నిర్ణయించే అవకాశం ఉన్నట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారి ఒకరు చెప్పారు.  మహబూబ్‌నగర్, జడ్చర్ల తర్వాత అత్యధికంగా వనపర్తి జిల్లాలోనే మార్కెట్‌ విలువను పెంచేందుకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. ప్రతి రిజిస్టేషన్‌కు మార్కెట్‌ విలువను బట్టి కొ నుగోలుదారులు రూ.లక్షకు రూ.6వేల చొప్పు న ప్రభుత్వానికి 

Related Posts