YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

ఆకాశంలో అద్భుతం... ఒకేసారి ఐదు సూర్యోదయాలు...

ఆకాశంలో అద్భుతం... ఒకేసారి ఐదు సూర్యోదయాలు...

ఆకాశంలో అద్భుతం... ఒకేసారి ఐదు సూర్యోదయాలు...
ఉత్తర చైనా... ఇన్నర్ మంగోలియా ప్రావిన్స్ ప్రజలు... ఆ రోజు ఉదయాన్నే తూర్పు వైపు చూశారు. అది అన్ని రోజుల లాంటిది కాదు. ప్రత్యేకమైనది. ఆ రోజు ఒకోసారి ఐదు సూర్యోదయాలు కనిపిస్తాయి. అనుకున్నట్లే ఆ రోజు తూర్పున ఐదు సూర్యోదయాలు కనిపించాయి. అంతా పరమానందం పొందారు.  ప్రజలంతా ఈ దృశ్యాన్ని చూసి... వావ్... భలే ఉంది... నా కళ్లతో నేనే నమ్మలేకపోతున్నా... అంటూ ఆశ్చర్యపోయారు. అది సరే... ఇదెలా సాధ్యం అన్న డౌట్ మనకు రావడం సహజం. ఎందుకంటే... మనకు ఉన్నది ఒక్కడే సూర్యుడు కదా. తెల్లారితే ఉదయించేది ఒక్క సూర్యుడేగా. అలాంటప్పుడు ఐదు సూర్యోదయాలు ఎలా కనిపిస్తాయి? 
తెలుసుకుందాం. ఈ ప్రకృతి వింత వెనక ఓ సైంటిఫిక్ రీజన్ ఉంది. ఇలా జరగాలంటే వాతావరణంలో మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండాలి. ఆ సమయంలో... వాతావరణంలో మంచు బిందువులు గాల్లో స్వేచ్ఛగా ఎగురుతూ ఉంటాయి. సూర్యుడి కాంతి కిరణాలు వాటిపై పడి... అవి రిఫ్లెక్ట్ అవుతాయి. ఈ వీడియోలో మధ్యలో ఉన్నది అసలైన సూర్యుడు. అటూ, ఇటూ రెండువైపులా ఉన్నవి ప్రతిబింబపు సూర్యోదయాలు. మన ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు. అలాంటి వాటిలో ఒకటైన ఈ వింతను చూసి అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను అందరికీ షేర్ చేస్తున్నారు.       

Related Posts