YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

 ప్రతిభావంతులైన విద్యార్థులకు రూ. 4.5 కోట్ల స్కాలర్ షిప్ లు

 ప్రతిభావంతులైన విద్యార్థులకు రూ. 4.5 కోట్ల స్కాలర్ షిప్ లు

 

 ప్రతిభావంతులైన విద్యార్థులకు రూ. 4.5 కోట్ల స్కాలర్ షిప్ లు
- విజయవాడలో ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాం
- జేకేఎల్ యూనివర్సిటీ ప్రతినిధి ఆశీష్ గుప్తా
విజయవాడ, ఫిబ్రవరి 17
ప్రతిభావంతుల కోసం అన్వేషించే జెకె లక్ష్మీపట్ విశ్వవిద్యాలయం తాము ప్రారంభిస్తున్న ఉన్నత విద్యా కార్యక్రమం కోసం విజయవాడ నుంచి అర్హులైన 100 మంది ప్రతిభావంతులను ఎంపిక చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా నూతన ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాం కింద ఎంపిక చేసిన విద్యార్థుల చదువుల కోసం రూ. 4.5 కోట్ల స్కాలర్షిప్లను ప్రకటించింది. ఏటా పురోగతి సాధిస్తున్న అనేక కంపెనీలు తమ క్యాంపస్ ను సందర్సిస్తున్నాయని, ప్లేస్ మెంట్లు కూడా ఏటికేడు పెరుగుతున్నాయని వర్సిటీ ప్రతినిధులు ప్రొ. ఆశీష్ గుప్తా, వర్సిటీ వైస్ చాన్స్ లర్ డా. జ్యోతి ప్రకాష్ సీఆర్ నాయుడు చెబుతున్నారు. జెకెఎల్యు ఆధ్వర్యంలో నిర్వహించే ఈ టాలెంట్ సెర్చ్ కు జెకె సంస్థ సహకారం అందిస్తోన్దని తెలిపారు. వీరి ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయం నుంచి సీనియర్ అధ్యాపకులు ఆదివారం విజయవాడను సందర్శించి స్కాలర్షిప్ కార్యక్రమాన్ని ప్రకటించారు. విజయవాడ నుంచి వచ్చే ఔత్సాహిక విద్యార్థులకు ప్రపంచ స్థాయి అభ్యాస అనుభవాలను అందించేలా వివిధ కార్యక్రమాలను అందించాలని యోచిస్తున్నామన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు జెకెఎల్యు మొత్తం రూ. 4.5 కోట్ల స్కాలర్షిప్ అందిస్తుందని తెలిపారు. 

Related Posts