YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సిద్దిపేటలో ఘనంగా వేడుకలు

సిద్దిపేటలో ఘనంగా వేడుకలు

సిద్దిపేటలో ఘనంగా వేడుకలు
సిద్ధిపేట, ఫిబ్రవరి 17 
జిల్లా కేంద్రమైన సిద్ధిపేట సుడా కార్యాలయం ముందు సోమవారం సుడా ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్బంగా ఏర్పాటు చేసిన శార్వరీ గ్రీన్ పార్కును రాష్ట్ర  ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. తరువాత సుడా కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. శార్వరీ గ్రీన్ పార్కులో కనువిందుగా ఉన్న జింక, గుర్రం, తాబేలు బొమ్మలను మంత్రి పరిశీలించారు.  మంత్రి మాట్లాడుతూ  సీఎం కేసీఆర్ 66 వ జన్మదినం సందర్భంగా సిద్ధిపేట జిల్లాలో లక్షా 10 వేల మొక్కలు నాటుతున్నాం. ప్రజలు సంతోషంగా తమ జన్మదినం జరుపుకున్నట్లు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.  - ప్రతి గ్రామంలో 200 మొక్కలు ప్రతి మున్సిపాలిటీలో 5 వేల మొక్కలు సిద్ధిపేట సుడా పరిధిలో 5900 మొక్కలు నాటుతున్నామని అన్నారు.  నాటిన ప్రతి మొక్కను కాపాడే బాధ్యత తీసుకోవాలి. - సీఎం కేసీఆర్ జన్మదినం స్ఫూర్తిగా మీ జన్మదిన రోజున కూడా మొక్కలు నాటాలని ప్రజలను కోరారు. మీ 
జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేయడంతో పాటుగా మొక్కను నాటి సంరక్షించాలని ప్రజలను కోరారు.  చనిపోయిన వారి పేరు మీద పట్టణంలోని శ్రీ రామ కుంట, ప్రశాంత్ నగర్ స్మశాన వాటికలోని స్మృతి వనం లో మొక్కలు నాటాలి.  ఉగాది పండుగ ఈ మార్చి నెల 25 రోజున శార్వరీ నామ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈ రోజు శార్వరీ గ్రీన్ పార్క్ ప్రారంభించుకున్నామని, ఈ పార్కు వాకింగ్ కి చిన్న పిల్లలకు ఆడుకోవడానికి గపడుతుంది. - మొక్కలు నాటే కార్యక్రమంలో విద్యార్థులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -మొక్కలు నాటడం కన్నా వాటిని సంరక్షించడం గొప్ప పని అని అన్నారు.  తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ ఆకుపచ్చ తెలంగాణగా జల తెలంగాణగా మార్చుతున్నారు. - సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక బొట్టు రక్తం చిందకుండా సాధించారు.   కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్కరం మొక్కలు నాటి 
ఆర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుదామని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు.- రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున మొక్కను నాటుతున్నారు.  తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కొనసాగించి మొక్కను సంరక్షిద్దాం.   రాబోయే రోజుల్లో పెళ్లిళ్ల లో కూడా రిటర్న్ గిఫ్ట్ గా మొక్కలు బహుమతిగా ఇద్దాం.  మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే శుభకార్యాల్లో కూడా మొక్కలను రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి హరిత తెలంగాణలో భాగస్వాములమవుదామని అన్నారు.

Related Posts