YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఐటీ రిపోర్టు చంద్రబాబుకు కనిపించడంలేదు

ఐటీ రిపోర్టు చంద్రబాబుకు కనిపించడంలేదు

ఐటీ రిపోర్టు చంద్రబాబుకు కనిపించడంలేదు
తాడేపల్లి ఫిబ్రవరి 17
పార్టీ ఐటి వారు ఇచ్చిన ప్రెస్ నోట్ క్షుణ్ణంగా చదివితే టిడిపివారి అసలు బండారం బయటపడుతుంది. 2 వేల కోట్ల అవినీతి జరిగిందని ఐటి డిపార్ట్ మెంట్ ఇచ్చిన ప్రకటన ద్వారా స్పష్టమైంది. చంద్రబాబుకు,ఎల్లోమీడియాకు ఇది కనిపించడం లేదా అని వైకాపా ఎంఎల్ ఏ  గుడివాడ అమరనాధ్ అన్నారు. సోమవారం అయన మీడియతో మాట్లాడారు. బోగస్ కంపెనీలతో వేల కోట్లు దారిమళ్లించారు. కోటి పక్కన ఎన్ని సున్నాలు పెట్టాలో టిడిపి నేతలకు బాగా తెలుసు. యనమలకు పంటినొప్పితోపాటు కంటిచూపు కూడా పోయింది. యనమలకు కంటి వైద్యం చేయించాలని సిఎం  వైయస్ జగన్ ను కోరతానని అన్నారు. దమ్ము ధైర్యం ఉంటే ఐటి అధికారులపై డిఫర్మేషన్ వేయండి. అవినీతి ఆరోపణలపై చంద్రబాబు ఏమాత్రం స్పందించడం లేదు. ఆయన పుత్రుడు లోకేష్ దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ గాని మాట్లాడలేకపోతున్నారు. అర్దరాత్రి విజయవాడనుంచి చంద్రబాబు ఎందుకు హైద్రాబాద్ పారిపోయారు. ఓటుకు నోటు కేసు వచ్చినప్పుడు చంద్రబాబు ఏమన్నారు.సెక్షన్ 8 అన్నారు. చంద్రబాబు హయాంలో కాపులకు సంబందించిన బిసిల అంశం వచ్చినప్పుడు కూడా క్యాబినెట్ మీటింగ్ పెట్టి సబ్జెక్ట్ డైవర్ట్ చేశారు.ఓటుకునోటు కేసులో ఆ ప్రభుత్వంపై దావా వేసే ధైర్యం ఉందా. పోలవరం వద్ద పాటలు పెట్టారు.జయం జయం చందన్న అని ఇప్పుడు అలా కాదు.జైలు జైలు చంద్రన్న అని పాడుకోవాల్సి ఉంటుందని అన్నారు. మీ బినామిలైన నారాయణ, ప్రతిపాటి పుల్లారావు, యరపతినేని, దేవినేని, గల్లా జయదేవ్ లాంటి వ్యక్తులందరూ కూడా వారందరికి ఎక్కడ పీకకు చుట్టుకుంటుంది. బినామి ఆస్దులు బయటపడిపోతాయి.ఇది గోరంత ఇంకా కొండంత అవినీతిచేశాను .అదంతా బయటపడి పోతుందనే భయంతో చలి జ్వరం వచ్చిందని ఇంట్లో పడుకున్నారని అన్నారు. కనీసం స్పందించకుండా మీ దగ్గర పిఎస్ గా పనిచేసేవ్యక్తి వద్దనే రెండువేల కోట్ల రూపాయల ఆరోపణలువచ్చాయని అంశంపై స్పందించాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా. మీరు ఇంకా నీతి నిజాయితి 40 సంవత్సరాల ఇండస్ర్టీ అంటూ మాట్లాడే నైతిక అర్హత ఎక్కడ ఉంటుంది. అచ్చెన్నాయుడు గారికి చంద్రబాబుగారిపై కోపం ఉన్నట్లు ఉంది.చంద్రబాబు తో తిరుమల కొండ ఎక్కగలరా అని సవాల్ చేశారు.ఈ వయస్సులో చంద్రబాబు  కొండఎక్కితే ఏమవుతుందో తెలిసే ఇలా సవాల్ చేశారంటే ఏమనాలి. రాష్ర్టానికి ఈడి,సిబిఐలను రాకుండా అడ్డుకుంది చంద్రబాబే. 2 వేల కోట్ల గురించి టిడిపికి ఐటి శాఖ విడుదల చేసిన ప్రెస్ నోట్ ఆరోపణలపై పరువునష్టం దావా వేసే ధైర్యం టిడిపికి ఉందా. మీరు అవినీతిగా సంపాదించిన ప్రతి రూపాయి.గత ఏడాది నవంబర్ 11 న ఇచ్చిన ప్రెస్ నోట్ లో కూడా 18అక్టోబర్ ,2019 ప్రెస్ రిలీజే్ లో కూడా ప్రామినెంట్ పర్సన్ ఆఫ్ ఏపి అని మెన్సన్ చేస్తూ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ల విషయంలో 150 కోట్ల మేర సెర్చ్ లలో దొరికాయని క్లియర్ గా చెప్పారు. ఇంకొకయాన అంటాడు 2 వేల కోట్లు అంటే ఎంతో తెలుసా అని అంటున్నారు.ఒక సూట్ కేసులో ఎన్ని వేల కోట్లు పడతాయో,ఒక గోనెలో ఎన్ని కొబ్బరి చిప్పలు పడతాయో మాకు తెలియదు.రెండు అంశాలపై మా పార్టీ తరపున క్లారిటీ ఇవ్వదలుచుకున్నాం. 2014లో గాని2019లోగాని అంతకుముందు బైఎలక్షన్ లలో గాని ఎవరితో పొత్తుపెట్టుకోలేదు అనే అంశం ప్రజలందరికి తెలుసు. పొత్తులు పెట్టుకునే సంస్కృతి చంద్రబాబుదే. కేవలం ఐదుకోట్ల మంది ప్రజలతోనే వైయస్సార్ కాంగ్రెస్ పొత్తు.ఏ రాజకీయపార్టీతో మా పార్టీ పొత్తు పెట్టుకోదు. ఐదుకోట్ల ప్రజలతోనే  వైయస్సార్ కాంగ్రెస్ పొత్తు. ఇచ్చినమాటకోసం చెప్పిన ప్రతి పనిని ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని ఎలా నెరవేర్చాలనే దిశగా  వైయస్ జగన్ ప్రయాణం  చేస్తున్నారు.రాష్ర్ట అభివృధ్ది, ప్రయోజనాలు అనేది మా నాయకుడి ఆలోచన.  పవన్ కల్యాణ్  ఓటుకు రెండు వేలు తీసుకునే ప్రజలకు ప్రశ్నించే హక్కు ఎక్కడుంది అని అంటున్నారు.భీమవరంలో 20 కోట్లు గాజువాకలో 30 కోట్లు ఖర్చు అయినట్లు ఉంది. ఆ ఖర్చు కూడా చంద్రబాబు ఇచ్చినట్లున్నారు. పవన్ కల్యాణ్ కు వ్యక్తిత్వం, సిధ్దాంతం లేదని అన్నారు. 

Related Posts