YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎమ్మార్వోపై రైతుల దాడి

ఎమ్మార్వోపై రైతుల దాడి

ఎమ్మార్వోపై రైతుల దాడి
విజయవాడ, ఫిబ్రవరి 17 
కృష్ణా జిల్లా కొత్తూరు తాడేపల్లి వేమవరంలో ఎమ్మార్వో వనజాక్షిపై రైతులు తిరగబడ్డారు. ఇళ్ల స్థలాల కోసం నిర్వహించిన గ్రామసభలో గందరగోళం రేగగా.. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సోమవారం వేమవరంలో ఇళ్ల పట్టాల కోసం భూమిని సేకరించేందుకు సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పశ్చిమ కృష్ణా జిల్లా కార్యదర్శి కోట కళ్యాణ్ రైతుల తరపున మాట్లాడారు.సభ జరుగుతున్న సమయంలో ఎమ్మార్వో వనజాక్షి రియల్ ఎస్టేట్ బ్రోకర్లు బయటకు వెళ్లాలన్నారు. దీంతో రైతులు ఆమెపై మండిపడ్డారు. రైతుల్ని బ్రోకర్లు అనడం ఏంటని ప్రశ్నించగా.. సభల గందరగోళం ఏర్పడింది. ఎమ్మార్వో క్షమాపణలు చెప్పాలని రైతులు, మహిళలు ఆమెను అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు కనిపించాయి. వనజాక్షి సభ జరుగుతున్న ప్రాంతం నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు.ఎమ్మార్వో బయటకు వస్తున్న సమయంలో ఆమెను మహిళలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. వనజాక్షిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఆమె తీరుపై మహిళలు, రైతులు మండిపడ్డారు.. రౌడీ ఎమ్మార్వో అంటూ నినాదాలు చేశారు.. ఆమెపై ఎమ్మెల్యే, కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Related Posts