లవ్ ఫెయిల్యూర్ అంటూ సెల్ఫీ తో ప్రమాదం
నిజామాబాద్, ఫిబ్రవరి 17
కామారెడ్డి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు బైక్ నడుపుతూ సెల్ఫీ వీడియో తీసుకుని ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన ఆ వీడియో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.కామారెడ్డి జిల్లా ఉగ్రవాయికి చెందిన ప్రదీప్ గౌడ్(19) అనే యువకుడు బైక్‌పై వేగంగా వెళ్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ప్రేమలో విఫలమయ్యానంటూ అందులో పేర్కొన్నాడు. కాసేపటికే బైక్ అదుపు తప్పడంతో తీవ్ర గాయాలపాలైన అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటనకు ముందుకు ప్రదీప్ ‘లవ్ ఫెయిల్యూర్’ అంటూ వాట్సాప్‌లో స్టేటస్ పెట్టినట్లు స్నేహితులు చెబుతున్నారు.ప్రదీప్ స్థానికంగా ఓ యువతిని గాఢంగా ప్రేమించాడని, అదికాస్తా విఫలం కావడం వల్లనే ఇలా చేసినట్లు స్నేహితులు, కుటుంబసభ్యులు చెబుతున్నారు. ప్రేమ వ్యవహారం కారణంగా అతడు ప్రమాదకరంగా బైక్ నడిపి ప్రాణాలు పోగొట్టుకున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఉదయం ఓ వ్యక్తితో కలిసి వేములవాడ వెళ్లిన ప్రదీప్ సాయంత్రం వేళ ఒంటరిగా తిరుగొస్తూ ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది. ప్రేమ కారణంగా కొడుకు దూరం కావడంతో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.