YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం విదేశీయం

కోవిడ్ 19 వైరస్ కు భారత్ ముందు

కోవిడ్ 19 వైరస్ కు భారత్ ముందు

కోవిడ్ 19 వైరస్ కు భారత్ ముందు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17 
కరోనా వైరస్.. దీని దెబ్బకు చైనా చిగురుటాకుల వణికిపోతోంది. కేవలం ఈ దేశం మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఈ వైరస్‌కు భయపడుతున్నాయి. వైరస్ విస్తరించకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. వైరస్ కారణంగా మరిణించిన వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. ఇప్పటికే 1770కి పైగా చనిపోయారు. ఇంకా వేల మందికి ఈ వైరస్ సోకింది.భారత్‌కు చెందిన జైడస్ క్యాడిల్లా ఫార్మా కంపెనీ కరోనా వైరస్‌కు మందు కనిపెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రీసెర్చ్ ప్రోగ్రామ్‌ను కూడా స్టార్ట్ చేసింది. కరోనా వైరస్‌‌కు వ్యాక్సిన్ తయారీ కోసం భారత్, యూరప్‌లో మల్టీపుల్ టీమ్స్‌తో ఇప్పటికే పని ప్రారంభించింది. కంపెనీయే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. రీసెర్చ్‌లో ప్రధానంగా రెండు దశలు ఉంటాయని పేర్కొంది.తొలి దశలో కరోనా వైరస్‌ మన శరీరంలోని కణాల్లోకి ప్రవేశించడానికి కారణమయ్యే వైరల్ మెంబ్రేన్ ప్రోటీన్‌ను నిరోధించేందుకు డీఎన్ఏ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తారు. ప్రస్తుతం COVID-19 అని పిలుస్తున్న కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో ఇది చాలా కీలక పాత్ర పోషించనుంది.డీఎన్‌ఏ వ్యాక్సిన్ ద్వారా ప్లాస్మ్ ఐడీ డీఎన్ఏ‌ను హోస్ట్ కణాల్లోకి ప్రవేశపెడతారు. ఇప్పుడు ఇది కరోనా వైరస్‌ను వ్యాప్తి చెందించే వైరల్ ప్రొటీన్‌‌లోకి చేరుతుంది. మానవ రోగ నిరోధక వ్యవస్థ సాయంతో ఇది కరోనా వైరస్ మరింత విస్తరించకుండా ఫైట్ చేస్తుంది. వైరస్‌ను తొలగిస్తుంది. అంటే వైరస్ సోకిన వారు వ్యాధి నుంచి రక్షణ పొందడానికి ఇది ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది.రెండో దశలో కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా లైవ్ అటెన్యూయేటెడ్ రీకాంబినెంట్ మీజిల్స్ వైరస్ వెక్టర్డ్ వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తారు. రివర్స్ జెనెటిక్స్ ఉత్పత్తి చేసిన రీకాంబినెంట్ మీజిల్స్ వైరస్ (ఆర్‌ఎంవీ) కరోనా వైరస్‌ కోడాన్-ఆప్టిమైజ్ ప్రోటీన్స్‌కు ప్రతిరోధకాలను ప్రేరేపిస్తుంది. దీంతో సంక్రమణ నుండి రక్షణ భిస్తుంది.కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి అర్జంట్‌గా వ్యాక్సిన్‌ను తయారు  చేయాల్సిన అవసరం ఉంది. వైరస్ వ్యాప్తిని అరికట్టాలి. అదేసమయంలో దానికి సమర్థవంతగా నివారించే మందును తయారు చేయాలి. మా పరిశోధకులు త్వరితగతిన సమస్యకు పరిష్కారం కోసం పనిచేస్తున్నారు’ అని జైడస్ గ్రూప్ చైర్మన్ పంకజ్ ఆర్ పటేల్ తెలిపారు.కొవిడ్‌తో మృతి చెందినవారి సంఖ్య 1,770కి చేరినట్టు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. ఆదివారం 100కిపైగా మరణాలు చోటుచేసుకున్నాయని పేర్కొంది. అలాగే కొత్తగా మరో 2 వేల మందికి వైరస్ సోకినట్టు తెలియజేసింది. దీంతో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 70,500కి చేరింది.

Related Posts