బస్సు ఎత్తుకెళ్లిన దుండగుడు
వికారాబాద్, ఫిబ్రవరి 17
వికారాబాద్‌లో ఓ గుర్తు తెలియని దుండగుడు ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లాడు. ప్రయాణికులందరూ బస్సులో ఉండగానే బస్సు ఎత్తుకెళ్లి.. బస్సు డ్రైవర్, కండక్టర్‌కు షాకిచ్చాడు. బస్సును ర్యాష్‌గా నడుపుతుండటంతో.. ఈ డ్రైవింగ్ ఏంటని ప్రయాణికులు నిలదీశారు. దీంతో వికారాబాద్ శివార్లలో బస్సును రోడ్డు మీదే ఆపేసి పరారయ్యాడు. దీంత బస్సులో ఉన్నవారంతా అవాక్కయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. తాండూరు డిపోకు చెందిన ఈ బస్సు తాండూరు సమీపంలోని కరోన్‌కోట్ నుంచి ఓగిపూర్ వెళ్తుండగా ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.బస్టాండ్‌లో బస్సును ఆపిన డ్రైవర్, కండర్టర్ భోజనానికి వెళ్లి తిరగొచ్చే సరికి బస్సు మాయమైంది. సెక్యూరిటీ సిబ్బంది బస్సు కోసం వెతికినా కనిపించలేదు. బస్సును పట్టణ శివార్లలో ఓ వ్యక్తి ఆపేశాడని ప్రయాణికుడొకరు సమాచారం ఇచ్చారు. వెంటనే డ్రైవర్‌ను, కండక్టర్‌ను పంపించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లిన ఘటన ఇదే తొలిసారి కానప్పటికీ.. ప్రయాణికులతో సహా బస్సును ఎత్తుకెళ్లే ప్రయత్నం చేయడం మాత్రం ఇదే ప్రథమం. గతంలో హైదరాబాద్‌లో కుషాయిగూడ డిపోకు చెందిన మెట్రో బస్సును గౌలిగౌడ నుంచి ఇద్దరు దుండుగులు ఎత్తుకెళ్లారు. దాన్ని మహారాష్ట్రలోని నాందేడ్ సమీపంలో ఉన్న స్క్రాప్ షాప్‌కి విక్రయించగా.. బస్సు ఆనవాళ్లు లేనంతగా పార్టులు పార్టులుగా విడగొట్టారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా బస్సును పట్టుకొని, దుండగులను గుర్తించారు. ఈ ఘటనలు ఆర్టీసీలో సెక్యూరిటీ వైఫల్యాన్ని కళ్లకు కడుతున్నాయి.