ఔటర్ బయిటకు కాలుష్య పరిశ్రమలు
హైద్రాబాద్,
హైదరాబాద్ లో కాలుష్యాన్ని వెదజల్లుతున్న 1295 పరిశ్రమలను ఔటర్ రింగ్‌రోడ్డు వెలుపలకు తరలింపుకు ప్రభత్వ అధికారులు సన్నాహాలు ప్రారంభించారు ప్రమాదకరమైన, తీవ్ర
స్థాయిలో కాలుష్యాన్ని వెదజల్లుతున్న రెడ్ కేటగిరిలో ఉన్న 1295 పరిశ్రమలను వెంటనే ఔటర్ వెలుపల స్థలాలను సేకరించి తరలించాలని అధికారులు సమాయత్తమవుతున్నారు. గతంలోనే
ప్రభుత్వం పరిశ్రమలను ఔటర్ వెలుపలకు తరలించాలని ప్రకటించినా ఇప్పడిప్పుడే అది ఆచరణ రూపం దాలుస్తున్నది.నగరు శివారు ప్రాంతాలలో ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి వాటిలో వేటిని
వెంటనే తరలించాలి, నిదానంగా తరలించే పరిశ్రమలు ఎన్ని అని లెక్కలు తీస్తున్నారు.నగరాన్ని విశ్వనగరంగా తీర్చి దిద్దడానికి తీసుకోవాల్సి ప్రణాళికలను రూపొందించాలని అధికారులను
ఆదేశించారు. దీనిలో ప్రధమంగా నగరంలో కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమలను గుర్తించి వెంటనే వాటిని ఔటర్ వెలుపలకు తరలించాలని ఆయన సూచించారు. పరిశ్రమల నుండి
వెలువడే కాలుష్యం వలన నగరలోని వివిద ప్రాంతాలలో జీవిస్తున్న ప్రజల ఆయుష్షును హరిస్తోంది. కాలుష్య తీవ్రతను బట్టి పరిశ్రమలను మూడు కేటగిరీలు గా కాలుష్య నియంత్రణ మండలి
విభజించింది. ప్రమాదకరంగా తీవ్ర స్థాయిలో కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమలను రెడ్ కేటగిరి, తక్కువ మోతాదులో కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమల ను ఆరెంజ్ కేటగిరి,
పరిశ్రమల వల్ల ఎటువంటి ప్రమాదంలేని వాటిని గ్రీన్ కేటగిరిగా పిసిబి అధికారులు విభజించారు.హైదరాబాద్ నగరు శివారు ప్రాంతాలలో ఉన్న పారిశ్రామికి ప్రాంతలలో రెడ్ కేటగిరి కింద
1295 పరిశ్రమలు, ఆరంజ్ కేటగిరి లో 1557, గ్రీన్ కేటగిర క్రింద 555 పరిశ్రమలు ఉన్నాయని పిసిబి అధికారిక లెక్కలు చెపుతున్నా యి. వీటిలొ ప్రధానంగా రెడ్ కేటగిరిలో ఉన్న
1295 పరిశ్రమలను వెంటనే ఔటర్ వెలుపల స్థలాలను సేకరించి తరలించాలని అధికారు లు సమాయత్తమవుతున్నారు. ఏది ఏమైన సుస్ధితర ప్రభుత్వ ఏర్పడగా నే పరిశ్రమల తరలింపు
చర్యలు ప్రారంభం కావడం పట్ల ప్రజలు తమ సంతోషాన్ని వెలువరిస్తున్నారు. నగరం శివారు పరిశ్రమలలో ప్ర ధానంగా కెమికల్, ఫార్మా పరిశ్రమలు అనుబంధ పరిశ్రమల ద్వా రానే కాలుష్యం
తీవ్రంగా వెలువడుతున్నదని ప్రజలందరికీ తెలిసినా వాటిని ఔటర్ వెలుపలకు తరలింపులో జాప్యం జరుగుతోంది. ఫార్మా పరిశ్రమలను మహబూబ్‌నగర్‌జిల్లా కడ్తాల్‌లో నిర్మిస్తున్న ఫార్మా
హబ్‌కు తరలించాలని ప్రభుత్వం నిర్ణయంతీసుకొన్నది.ఫార్మా పరిశ్రమల నుండి వెలువడే కాలుష్య వ్యర్ధాలను శుద్దిచేసే ప్లాంట్‌ను కూడా ప్ర భుత్వం కడ్తాల్‌లో ఏర్పాటు చేస్తోంది. గతంలో
నగరం వెలుపల ఉన్న పారిశ్రామిక వాడలైన ఉప్పల్, నాచారం, మల్లాపూర్, చర్లపల్లి, సనత్‌నగర్, బాలానగర్, జీడిమెట్ల, ఐడిఎ బొల్లారం, కూకట్‌పల్లి, బాచుప ల్లి, పటాన్‌చెరు ప్రాంతాలు
ఇప్పుడు గ్రేటర్ పరిదిలోకి వచ్చాయి. ని వాస ప్రాంతాలతో పాటు వ్యాపార వాణిజ్య కేంద్రాలతో విస్తరిస్తున్న న గరంలో కాలుష్యం ప్రధాన సమస్యగా మారింది. మన తెంగాణరాష్ట్రంలోని
పరిశ్రమలలో 70శాతం హైదరాబాద్, రంగారెడ్డిజిల్లాల పరిధిలోనే ఉన్నాయని అధికారలెక్కలు చెపుతున్నాయి.