ముంబై, ఫిబ్రవరి 18, పసిడి వెలవెలబోయింది. నిన్న పరుగులు పెట్టిన బంగారం ధర ఈరోజు మాత్రం దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. దేశీ మార్కెట్‌లోనూ జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ తగ్గింది. దీంతో పసిడి ధర కిందకు దిగింది. అలాగే అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి రికవరీ బాట పట్టడం కూడా బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపింది.
బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్. బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పైకి కదిలింది.గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర క్షీణించింది. పసిడి ధర ఔన్స్‌కు 0.08 శాతం పడిపోయింది. 1,585.10 డాలర్లకు తగ్గింది. బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పైకి కదిలింది. వెండి ధర ఔన్స్‌కు 0.33 శాతం పెరుగుదలతో 17.79 డాలర్లకు చేరింది.హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం 22 క్యారెట్ల బంగారం ధర దిగొచ్చింది. పసిడి ధర 10 గ్రాములకు రూ.100 క్షీణించింది. దీంతో రూ.39,250 నుంచి రూ.39,150కు తగ్గింది.అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా పడిపోయింది. రూ.140 తగ్గింది. దీంతో పసిడి ధర 10 గ్రాములకు రూ.42,780 నుంచి రూ.42,640కు క్షీణించింది.బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పెరిగింది. కేజీ వెండి ధర రూ.50 పైకి కదిలింది. దీంతో ధర రూ.49,500 నుంచి రూ.49,550కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయరీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు కారణంఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా పసిడి, వెండి ధరల పరిస్థితి కూడా ఇలానే ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గుదలతో 10 గ్రాములకు రూ.39,150కు క్షీణించింది. వెండి ధర రూ.49,550కు పెరిగింది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.160 క్షీణించింది. దీంతో ధర రూ.41,150కు తగ్గింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.160 తగ్గుదలతో రూ.39,950కు క్షీణించింది. ఇక కేజీ వెండి ధర రూ.49,550కు చేరింది.పసిడి రేటు రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు ఇందుకు దోహదపడతాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగా కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడితే.. ఆ అంశం కూడా పసిడి మెరుపులకు కారణంగా నిలవొచ్చని తెలిపారు. బంగారం ధర రానున్న కాలంలో రూ.45,000కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.