శ్రీకాళహస్తి ఫిబ్రవరి 18 రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం వారిది. తమకు ఇద్దరు ఆడపిల్లలే కావడంతో పోషించడం కష్టంగా మారింది. ఈ దశలో ఓ ఆడపిల్లను అమ్ముకునేందుకు సిద్ధమైన సంఘటన శ్రీకాళహస్తి మండలం ఎగువవీధి పంచాయతీ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి సీడీపీవో శాంతిదుర్గ కథనం మేరకు తొండమాన్‌పురం గ్రామానికి చెందిన తల్లిదండ్రులకు ఇద్దరు ఆడపిల్లలు. నిరుపేదు కుటుంబానికి చెందిన దంపతులు కావడంతో కుటుంబం గడవడం కష్టంగా మారింది. స్థానికంగా ఓవ్యక్తికి ఒక కుమార్తెను విక్రయించేందుకు సిద్ధమయ్యారు. దీంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. శ్రీకాళహస్తి గ్రామీణ పోలీసులు, ఐసీడీఎస్ సిబ్బంది బాలికల తల్లిదండ్రులను విచారించారు. బాలికల రక్షణ నిమిత్తం వారిని శ్రీకాళహస్తి పట్టణంలోని బాలసదన్‌కు తరలించినట్లు సీడీపీవో పేర్కొన్నారు. దీనిపై గ్రామీణ సీఐ విజయకుమార్‌ను వివరణ కోరగా తమ బంధువులతో తమాషాగా మాట్లాడిన మాటలను కొందరు అపార్థం చేసుకున్నట్లుగా తమ విచారణలో తేలినట్లు పేర్కొన్నారు