YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

మయుర వాహనం పై స్వామి అమ్మవార్లు

మయుర వాహనం పై స్వామి అమ్మవార్లు

శ్రీశైలం ఫిబ్రవరి 18,  శ్రీశైల మహా క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. 11 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు శ్రీశైల మహాక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది.ఈ మహా శివరాత్రి  బ్రహ్మోత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం నుంచి ప్రత్యేక పూజలను నిర్వహించి సాయంకాలం ప్రదోషకాల పూజలను, జపాను స్టానాలను
నిర్వహించారు. ఈరోజు సాయంకాలం నిర్వహించే వాహన సేవలో భాగంగా సాయంకాలం స్వామి అమ్మవార్లను మయుర వాహనసేవ జరిపించారు. ఈ సేవలో స్వామి అమ్మవార్ల  ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో మయుర వాహనంపై వేంచెంబు చేసి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ అలంకరింపజేసిన మయురా వాహనాన్ని శ్రీశైల క్షేత్ర  ప్రధాన వీధుల్లో గ్రామోత్సవంగా తోడ్కొనివెళ్లిన ఉత్సవం కన్నుల పండుగగాసాగింది. ఈ గ్రామోత్సవంలో పలు సాంస్కృతిక నృత్యాలలో కోలాటాలు డోలు ,సాంప్రదాయ నృత్యాలు,గోరవయ్యాల
పిల్లనగ్రోవులు,లంబాడా డ్యాన్సులు  మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ప్రత్యేక ఆకర్షణగా పలు కళారూపాలతో ఈ గ్రామోత్సవం ఎంతో కన్నుల పండువగా సాగింది. ఈ కార్యక్రమంలో ఆలయ  కార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామారావు ప్రత్యేక ఏర్పాట్లను భక్తులకోసం చేశారు

Related Posts