హైదరాబాద్, ఫిబ్రవరి 18, హైదరాబాద్ లోని నేరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో ఘోరం జరిగింది. చిన్న పిల్ల అని కూడా చూడకుండా ఒక కామాంధుడు అత్యాచారం చేయబోయాడు. సైనిక్ పురి లోని ఆర్.ఎస్ డిజిటల్ ఫోటో స్టూడియోలో ఈ దారుణ సంఘటన జరిగింది. ఫోటో కోసం వెళ్ళిన మైనర్ బాలికతో స్టూడియో యజమాని సలీం అసభ్యంగా ప్రవర్తించాడు. బాలికపై అత్యాచారం చేసే ప్రయతం చేసాడు.దాంతో పరిస్థితి అర్ధమైన బాలిక అరచుకుంటూ బయటకి పరుగులు తీసింది. ఏమైందోనని స్థానికులు అక్కడకు హుటాహుటిన చేరుకున్నారు. అఘాయిత్యం చేయబోయిన స్టూడియో యజమాని సలీం కి దేహశుద్ది చేసారు. బాలిక తల్లి నెరేడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు రంగంలోకి దిగారు. స్థానికుల దాడిలో గాయాలుపాలైన సలీం ప్రస్తుతం స్థానిక హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.