YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

 యదేఛ్చగా గనుల అక్రమ తవ్వకాలు

 యదేఛ్చగా గనుల అక్రమ తవ్వకాలు

 యదేఛ్చగా గనుల అక్రమ తవ్వకాలు
ఒంగోలు, ఫిబ్రవరి 19,
నిబంధనలకు విరుద్ధంగా గ్రానైట్ తవ్వకాలు జరిపిన గ్రానైట్ క్వారీల యజమానులపై రాష్ట్రప్రభుత్వం కొరడా ఝుళిపించింది. ఇటీవల కాలంలో జిల్లాలోని చీమకుర్తి, బల్లికురవ, గురిజేపల్లి గ్రామాల్లోని గ్రానైట్ క్వారీలపై విజిలెన్స్ అధికారులు ముమ్మరంగా జరిపిన తనిఖీలు రాష్టవ్య్రాప్తంగా సంచలనంగా మారింది. విజిలెన్స్ అధికారులు చేపట్టిన తనిఖీల నివేదికను రాష్ట్రప్రభుత్వానికి సమర్పించారు. ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా గ్రానైట్ త్వవకాలు చేసిన యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు అందచేసే పనిలో నిమగ్నమైంది. జిల్లావ్యాప్తంగా సుమారు రెండువేల కోట్ల రూపాయల విలువైన గ్రానైట్‌ను నిబంధనలకు విరుద్ధంగా తవ్వారన్న అభియోగాలపై విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరించారు. ప్రధానంగా మైనింగ్ అధికారులకు సమర్పించిన ప్లానింగ్ ప్రకారం కాకుండా కొంతమంది ఎక్కువగా మైనింగ్ తవ్వకాలు జరిపినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అదేవిధంగా రాయల్టీ రూపంలోను ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని పెద్దపెద్ద గ్రానైట్ పరిశ్రమల యజమానుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలోని 34మంది గ్రానైట్ క్వారీల యజమానులకు మైనింగ్ అధికారులకు నోటీసులు జారీచేయగా, మిగిలిన 20మందికి కూడా నోటీసులు అందచేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు అధికారవర్గాల సమాచారం. ఈ తవ్వకాలు జరిపినవారిలో రాజకీయ ప్రముఖులు ఎక్కువగా ఉన్నట్లు రాష్ట్రప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రప్రభుత్వం గ్రానైట్ క్వారీలపై ప్రత్యేకదృష్టి సారించిన నేపథ్యంలో ఈ బాగోతం బయటకు వచ్చిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రప్రభుత్వం పట్టించుకోకుండా ఉంటే రానున్నరోజుల్లో మరింతగా గ్రానైట్ క్వారీల యజమానులు కోట్లరూపాయల్లో అవినీతికి పాల్పడేవారన్న చర్చ సాగుతోంది. ప్రధానంగా జిల్లాలోని చీమకుర్తి ప్రాంతంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గెలాక్సీ గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయి. కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ నుంచి ఇతర దేశాలకు గెలాక్సీ గ్రానైట్ ఎగుమతి అవుతోంది. గతంలోనూ నిబంధనలకు విరుద్ధంగా గ్రానైట్ తవ్వకాలు జరిపిన సందర్భంలో కొంతమంది కార్మికులు మృత్యువాత పడ్డారు. ఆ సమయంలో రాష్టవ్య్రాప్తంగా ఆ సంఘటన సంచలమైందనే చెప్పవచ్చు. విజిలెన్స్ అధికారుల ముమ్మర తనిఖీల్లో భారీగానే గ్రానైట్ క్వారీల్లో బడానేతలు అక్రమాలకు పాల్పడ్డారన్న విషయం బయటకు వచ్చింది. రాష్ట్రప్రభుత్వం అక్రమార్కుల నుంచి ఏ మేరకు నగదు స్వాధీనం చేసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది

Related Posts