YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

రెండో రాజధానితో బీజేపీ ముందుకు..

రెండో రాజధానితో బీజేపీ ముందుకు..

రెండో రాజధానితో బీజేపీ ముందుకు...
హైద్రాబాద్, ఫిబ్రవరి 19
సానుకూలత అంశాలున్న తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నిలదొక్కుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు స్థానాలను చేజిక్కించుకోవడంతో ఆశ మరింత పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానానికే పరిమితమయిన బీజేపీ పార్లమెంటు ఎన్నికల్లో ఊహించని విజయం అందడంతో తెలంగాణను ఎప్పటికైనా గుప్పిట పెట్టుకోవాలని భావిస్తుంది. అయితే సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ బలంగా ఉండటంతో ఇప్పట్లో సాధ్యమయ్యేలా కన్పించడం లేదు.అందుకే ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులతో ముందుకు వెళుతుంది. కేసీఆర్, మజ్లిస్ అంట కాగుతున్నారని హిందూ ఓటు బ్యాంకును చేజిక్కించుకోవడానికి బీజేపీ చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదనే చెప్పాలి. నిజామాబాద్, కరీంనగర్ వంటి కొన్ని ప్రాంతాలు తప్పించి రాష్ట్రం మొత్తం మీద బీజేపీ ఆ నినాదాన్ని తీసుకెళ్లలేకపోయింది. ప్రజలు కూడా అభివృద్ధిని, సంక్షేమ పథకాలను కోరుతుండటంతో బీజేపీ వేసిన మతం మంత్రం ఫలించలేదనే చెప్పాలి.ఇక హైదరాబాద్ ను రెండో రాజధానిగా చేసి కేసీఆర్ ను కొంత ఇరుకున పెట్టాలన్నది బీజేపీ మరొక వ్యూహంగా కన్పిస్తుంది. హైదరాబాద్ లేని తెలంగాణతో కేసీఆర్ కు ఇక్కట్లు తప్పవు. అందుకే బీజేపీ ఇప్పుడు తరచూ హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అంటూ ప్రకటనలు చేస్తుంది. సాక్షాత్తూ మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు లాంటి వాళ్లు ఈ ప్రకటన చేయడంతో ప్రాధాన్యతం సంతరించుకుంది. అలాంటి ప్రతిపాదన ఏమీ లేదని కేంద్రం పెద్దలు చెబుతున్నా కెలకడం ఖాయమని రాష్ట్ర నేతలు అంటున్నారు. దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ ను అంగీకరించేది లేదంటూ తెలంగాణ రాష్ట్ర సమితి కుండబద్దలు కొట్టేసింది. మరో ఉద్యమం చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తుంది. ఢిల్లీలో ఇటీవల జరిగిన ఒక సమావేశంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ ను అంగీకరించే ప్రసక్తి లేదని చెప్పారు. హైదరాబద్ ను చేస్తే మిగిలిన ముఖ్యమంత్రులు అంగీకరించే ప్రసక్తి ఉండదని చెప్పారు. రాజకీయంగా రగడ సృష్టించాలనుకుంటున్న బీజేపీ ఈ వ్యూహం అమలు చేస్తుందో? లేదో? చూడాలి.

Related Posts