YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కరీంనగర్ ఎంపీ గా లక్ష్యం.. దేశ రాజకీయాల్లోకి కేసీఆర్!

కరీంనగర్ ఎంపీ గా లక్ష్యం.. దేశ రాజకీయాల్లోకి కేసీఆర్!

కరీంనగర్ ఎంపీ గా లక్ష్యం.. దేశ రాజకీయాల్లోకి కేసీఆర్!
హైదరాబాద్  ఫిబ్రవరి 19
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పని చేసినా ఆ విషయం అందరికి అర్థం కాదు అర్ధమైయ్యేలోపు అయన చేయాలనుకున్న పనిని పూర్తిచేస్తారు. కష్టం అనిపించే పనులని చేసి చూపించడం కేసీఆర్ కి వెన్న తో పెట్టిన విద్యలాంటిది. ఉద్యమ కాలం నుంచే దూకుడుగా వ్యవహరిస్తూ సందర్భానుసారం అణుకువగా ఉంటూ పక్కా వ్యూహాలని అమలుచేసి ఉద్యమాన్ని సూపర్ సక్సెస్ చేశారు. పదవులకు రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసినా ఇతరులు చేయలేనిదాన్ని సుసాధ్యం చేసినా ముందస్తు ఎన్నికలకు వెళ్లి సాహసం చేసినా ఆయనకే చెల్లింది. ఒక్కముక్కలో చెప్పాలి అంటే నువ్వు మొండి ఐతే నేను జగమొండి అనే టైపు సీఎం కేసీఆర్ అని రాజకీయ విశ్లేషకులు చెప్తుంటారు. దీనితోనే సీఎం కేసీఆర్ కి దేశ రాజకీయాల్లో ఒక స్పెషల్ ఇమేజ్ ఉంది. దీనితో గత ఎన్నికలకి ముందు బీజేపీ కాంగ్రెస్ కి ప్రత్యన్యాయంగా ఫెడరల్ ఫ్రంట్ అన్న మాటతో ఢిల్లీ పెద్దల్లో వణుకుపుట్టించారు. కానీ ఆ తరువాత పెద్దగా ఆ విషయాన్ని పట్టించుకోలేదు. కానీ ప్రస్తుతం కేసీఆర్ వ్యవహార తీరుని పరిశీలిస్తే ..మళ్లీ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం పదవిని కేటీఆర్ కి అప్పగించి ..కేసీఆర్ దేశ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి  పెట్టబోతున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కేటీఆర్ కు రాష్ట్ర బాధ్యతలు అప్పగించి.. దేశవ్యాప్తంగా తనకున్న పలుకుబడి తో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా ముందుకు సాగే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే అయన దృష్టి మొత్తం కరీంనగర్ పై పెట్టినట్టు తెలుస్తుంది. దీని వెనుక పెద్ద కారణం ఉంది అని వినిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు సమీక్ష సహా.. ఇతర అంశాలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు.. ఆయనే స్వయంగా జిల్లాలో పర్యటించారు. కరీంనగర్ జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇంత వేగంగా కరీంనగర్ అభివృద్ధికి బాటలు వేయడానికి అసలు కారణం వేరే ఉందని ప్రచారం జరుగుతోంది. సీఎం బాధ్యతలని కేటీఆర్ కి అప్పగించి ..దేశ రాజకీయాలలోకి వెళ్ళాలి అంటే ..ఎంపీ గా పోటీచేయాల్సి ఉంటుంది.  దీనికోసమే తనకు ఎంతగానో కలిసొచ్చిన కరీంనగర్ నుంచి ఎంపీ పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే అక్కడ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసినట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో కరీంనగర్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసి...భారీ మెజారిటీ తో విజయం సాధించాలని అనుకుంటున్నారు. దీనితో అక్కడ బీజేపీకి కూడా చెక్ పెట్టినట్టు అవుతుంది అని కేసీఆర్ భావిస్తున్నారని రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నారు.

Related Posts