ఆధార్ అడిగే హక్కు పోలీసులకు లేదు: అసదుద్దీన్ ఓవైసీ
హైదరాబాద్ ఫిబ్రవరి 19
: నగరంలో 127 మందికి ఆధార్ సంస్థ నోటీసులు ఇవ్వడంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. 127 మంది జాబితాలో ముస్లింలు, దళితులు ఎవరని ప్రశ్నించారు. ఈ మేరకు తెలంగాణ పోలీసులకు, ఆధార్ సంస్థకు అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు. 127 మంది జాబితాపై తెలంగాణ డీజీపీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్డెన్ సెర్చ్‌లో పోలీసులు ఆధార్ అడగడం మానేయాలని, ఆధార్ అడిగే హక్కు పోలీసులకు లేదని అసదుద్దీన్ స్పష్టం చేశారు.