YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పాదయాత్రలో ముద్దులు.. ప్రభుత్వం వచ్చాక రద్దులు: దేవినేని

పాదయాత్రలో ముద్దులు.. ప్రభుత్వం వచ్చాక రద్దులు: దేవినేని

పాదయాత్రలో ముద్దులు.. ప్రభుత్వం వచ్చాక రద్దులు: దేవినేని
విజయవాడ ఫిబ్రవరి 14
పాదయాత్రలో ముద్దులు పెట్టిన జగన్...ప్రభుత్వం వచ్చాక రద్దులు మొదలుపెట్టారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. బుధవారం గొల్లపూడిలో నిర్వహించిన ప్రజాచైతన్య యాత్రలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పేరు కనిపించకూడదనే అన్నా క్యాంటిన్లను రద్దు చేశారని ఆరోపించారు. అమరావతిని ఆపేశారని, పోలవరాన్ని పడుకోబెట్టారని  విమర్శించారు. అకారణంగా 20లక్షల మంది రేషన్‌కార్డులు తొలగించారన్నారు. వైసీపీ తీరుతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడంలేదని తెలిపారు. జగన్‌ తొమ్మిది నెలల పాలన...9 రద్దులు, 9 భారాలు, 9 మోసాలుగా సాగుతున్నదని వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తే...ఇప్పుడు ఇసుక పేరుతో వైసీపీ నేతలు కోట్లు గడిస్తున్నారని దేవినేని మండిపడ్డారు. 

Related Posts