YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

కరకంబాడి అడవులలో  34 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం

కరకంబాడి అడవులలో  34 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం

కరకంబాడి అడవులలో  34 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం. రెండు కార్లు, ఒక ద్విచక్ర వాహనం  స్వాధీనం
ఐదుగురు స్మగ్లర్లు అరెస్టు స్మగ్లర్లు ఎదురుదాడి కానిస్టేబుల్ కు గాయాలు
తిరుపతి ఫిబ్రవరి 19
కరకంబాడి రోడ్డు లోని టిఎన్ ఆర్ కల్యాణ మండపం సమీపంలోని అడవులలో వాహనాలలో లోడింగ్ చేస్తున్న  34 ఎర్ర చందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్ర చందనం దుంగలను తరలిస్తున్న ఐదుగురు స్మగ్లర్లు ను అరెస్టు చేయగా , వారు ఉపయోగిస్తున్న రెండు కార్లు, ఒక మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఇంచార్జి పి రవిశంకర్ గారికి అందిన సమాచారం మేరకు బుధవారం తెల్లవారు జామున ఆర్ ఎస్ ఐలు వాసు, కృపానంద, లక్ష్మణ్ ల టీమ్ కరకంబాడి రోడ్డు సమీపంలో ని  శేషాచలం అడవులలో కూంబింగ్ చేపట్టారు. బ్యాంకు కాలనీ వద్ద ఉన్న అడవి మార్గం నుంచి దాదాపు  ఇరవై మంది స్మగ్లర్లు దుంగలను మోసుకొచ్చి వాహనాలలో లోడింగ్ చేస్తూ కనిపించారు. టాస్క్ ఫోర్స్ బృందం వారిని చుట్టు ముట్టడంతో కొంతమంది స్మగ్లర్లు  సిబ్బందిపై దాడికి దిగారు. పెనుగులాటలో శ్రీను  కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. స్మగ్లర్లు కొంతమంది దుంగలు పడేసి పారిపోగా, ఐదుగురుని పట్టుకోగలిగారు. వారిని వడమాలపేట కు చెందిన గురక భాను ప్రకాష్ (33), కడప జిల్లాకు చెందిన హరి (20), చందు వెంకటేష్ (40), గండికోట సురేష్ ( 22),  గొండి కిరణ్ (22) లుగా గుర్తించారు. వారి  నుంచి 34 ఎర్ర చందనం దుంగలు, రెండు కార్లు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. సంఘటన స్థలానికి  టాస్క్ ఫోర్స్ ఇంచార్జి శ్రీ పి రవిశంకర్, డీఎస్పీ వెంకటయ్య చేరుకుని పరిస్థితి సమీక్షించారు. సిబ్బందిని అభినందించారు. సిఐ సుబ్రమణ్యం చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఆపరేషన్ లో డీఆర్వోలు పి.వి.నరసింహ రావు, వరప్రసాద్, ఎఫ్ ఎస్ ఒ నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts