ఫిబ్రవరి 20 నుండి
శ్రీ శేషాచల లింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవం
తిరుపతి ఫిబ్రవరి 19
టిటిడికి అనుబంధంగా ఉన్న చంద్రగిరి మండలం కందులవారిపల్లిలోని శ్రీ శేషాచల లింగేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 20 నుండి 22వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవం ఘనంగా జరుగనుంది.ఫిబ్రవరి 20వ తేదీన సాయంత్రం 4.30 గంటలకు కలశ స్థాపన, ఏకాదశ రుద్ర ఆవాహనం నిర్వహిస్తారు. ఫిబ్రవరి 21న మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున 4.15 నుండి 5 గంటల వరకు శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ సుబ్రమణ్యస్వామి, శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ ఉమామహేశ్వరస్వామివారికి అభిషేకం జరుగనుంది. ఉదయం 5 నుండి 7 గంటల వరకు శ్రీ శేషాచల లింగేశ్వరస్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 4.30 నుండి 6 గంటల వరకు శ్రీ శేషాచల లింగేశ్వరస్వామివారికి, శ్రీ నందీశ్వరస్వామివారికి అభిషేకం చేస్తారు. రాత్రి 7 నుండి 12 గంటల వరకు హరికథ, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 22న అర్థరాత్రి 12 నుండి ఉదయం 6 గంటల వరకు మహన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహిస్తారు. ఆ తరువాత ఉదయం 10 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం ప్రారంభమవుతుంది. రూ.300/- టికెట్ కొనుగోలు చేసిగృహస్తులు(ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు గ్రామోత్సవం నిర్వహిస్తారు. టిటిడి డెప్యూటీ ఈవో శ్రీ పి.సుబ్రమణ్యం ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.