YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అతి తక్కువ కాలంలో మార్పులు చేసాం

అతి తక్కువ కాలంలో మార్పులు చేసాం

అతి తక్కువ కాలంలో మార్పులు చేసాం
విజయవాడ ఫిబ్రవరి 19 
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విజయవాడలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ 'మీట్ ద ప్రెస్' కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా  అయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అందరికీ ఇవ్వడం రైతులకు ఇవ్వాల్సిన పథకాలు అందించడం రైతులు కునారిల్లిన దశలో ప్రభుత్వం అనేక పథకాలు పెట్టింది. విపత్తు వచ్చిన తరువాత రైతులు నస్తోయిన తరువాత ఇచ్చేకంటే ముందే సంక్షేమ పథకాలు ఇవ్వాలని నిర్ణయించామని అన్నారు. కరువు నుండి రైతులను ఆదుకోవాలని అనుకున్నాం. రైతులు వల్ల కాళ్లపై వాళ్ళు నిలబడాలని నిర్ణయించాం. ఎన్నికలు అయ్యి అధికారంలోకి వచ్చిన నాటినుండి అన్ని పథకాలు అమలు చేయాలి అనుకున్నాం. ప్రారంభించి ఒకటి రెండు కాకుండా అన్ని చేయాలనుకున్నామని అన్నారు. అందరికీ ఏదో ఒకటి చేయాలనుకున్నాం. పథకాలు ఎలా వున్నాయో ఎప్పటికీ అప్పుడు పర్యవేక్షణ చేస్తున్నాం. రాష్ట్రంలో అతి తక్కువ కాలంలో మార్పులు చేశామని అన్నారు.చంద్రబాబు రూ.2.60 లక్షల కోట్లు అప్పుల భారం మోపారని, ఒక్క ఆదాయ వనరును కూడా సృష్టించలేకపోయారని విమర్శించారు. 2014 2019 మద్య రాష్ట్రంలో చంద్రబాబు బాధ్యత రహితంగా వ్యవహరించారని అన్నారు. బీజేపీ తో కలిసి ఐదేళ్లలో ఎలాంటి హామీలు తీసుకోలేదు. రాష్ట్రాన్ని ముంచేశాడని ఆరోపించారు. తను చేసిన తప్పులు సరిది ద్దుకోకుండ అప్పులు చేయడం పై దృష్టిపెట్టారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రతిపాదనల ప్రకారం ముందుకెళితే లక్ష కోట్ల రూపాయల వ్యయం అవుతుందని, అంత మొత్తం ఒక్క చోటే ఖర్చు చేయడం ఎందుకుని జగన్ వికేంద్రీకరణ వైపు మొగ్గుచూపారని సజ్జల వివరించారు.

Related Posts